వేడిగాలులకి 1100 మంది బలి -ఫోటోలు

భారత దేశాన్ని, అందునా దక్షిణ భారతాన్ని, అందులోనూ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వేడి గాలులు పట్టి ఊపేస్తున్నాయి. గత వారం రోజుల్లోనే వెయ్యికి పైగా ప్రజలు వడగాలులకు బలైపోగా మొత్తం మీద ఈ వేసవి కాలంలో వడదెబ్బకు గురై మరణించినవారి సంఖ్య 1100 దాటి పోయిందని జాతీయ, అంతర్జాతీయ పత్రికలు తెలిపాయి. దాదాపు ప్రతి అంతర్జాతీయ వార్తా సంస్ధ భారత దేశంలో వేడి గాలుల గురించి గత కొద్ది రోజులుగా తప్పనిసరిగా వార్తలు…

అమెరికా వేడి గాలులకి 42 మంది దుర్మరణం

అమెరికాలో వేడి గాలుల తీవ్రత కొనసాగుతోంది. పర్యావరణంలో మార్పుల ప్రభావంగా నిపుణులు చెబుతున్న ఈ వేడి గాలులు గత కొద్ది రోజులుగా అమెరికా లోని కనీసం డజను రాష్ట్రాలను చుట్టుముట్టాయి. ముఖ్యంగా మిడ్ వెస్ట్ నుండి తూర్పు తీరం వరకూ ఈ వేడి గాలులు వ్యాపించి ఉన్నాయని బి.బి.సి వార్తా సంస్ధ తెలిపింది. పంటలు శుష్కించుకుపోగా, రోడ్లు, రైల్వే లైన్ల రూపు రేఖలు మారిపోయాయని ఆ సంస్ధ తెలిపింది. వందల కొద్దీ ఉష్ణోగ్రతా రికార్డులు బద్దలయ్యాయని తెలిపింది.…