యాహూ అస్తమయం ఇక గోడ మీది రాత!

గూగుల్ కంటే ముందు స్ధాపించబడి ఇంటర్నెట్ సర్చ్ ప్రపంచాన్ని రారాజుగా ఏలిన యాహూ త్వరలో ఒక స్వతంత్ర కంపెనీగా ఉనికి చాలించనున్నది. యాహూ కేంద్ర (కోర్) బిజినెస్ కార్యకలాపాలను అమెరికా టెలీ కమ్యూనికేషన్ దిగ్గజం వెరిజాన్ కంపెనీ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరిన దృష్ట్యా ఈ పరిణామం పూర్తి కావడమే ఇక మిగిలింది. ఆపరేటింగ్ బిజినెస్ గా పేర్కొనబడుతున్న యాహూ ఇంక్ కార్యకలాపాలను 4.4 బిలియన్ డాలర్లకు (వోక్స్ పత్రిక 4.8 బిలియన్ డాలర్లుగా పేర్కొంది) కొనుగోలు…

గూఢచర్యం ప్రపంచీకరణ: ఎల్లలు లేని ఒబామా ఫోన్ ట్యాపింగ్

మొట్టమొదటి నల్లజాతి అధ్యక్షుడు బారక్ ఒబామా నల్ల చట్టాలు అమలు చేయడంలో జార్జి డబ్ల్యూ. బుష్ ని మించిపోతున్నారు. ప్రభుత్వ చెప్పు చేతల్లోని విదేశీ గూఢచర్య కోర్టు (Foreign Intelligence Surveillance Act Court -FISA Court) నుండి తనకు కావలసిన ఆర్డర్ తెప్పించుకుని అమెరికా ప్రజలతో పాటు ప్రపంచంలోని ఇతర అన్ని దేశాల ప్రజల ఫోన్ సంభాషణల పైనా గూఢచర్యం సాగించడానికి తెగబడ్డాడు. గత ఏప్రిల్ 25 తేదీన కోర్టు ఈ మేరకు ఆర్డర్ సంపాదించారని…