విఫల స్వప్నం విషమై హిట్లర్ ప్రాణాన్ని మింగిన వేళ… -ఫోటోలు

‘Thousand-Year Reich!” ఇది జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ఇష్టంగా ప్రవచించిన కల. Reich అంటే జర్మనీ భాషలో సామ్రాజ్యం అని అర్ధం. జర్మనీ సామ్రాజ్యం వెయ్యేళ్లు అవిచ్ఛిన్నంగా సాగాలని హిట్లర్ కలలు కన్నాడు. కానీ సోవియట్ రష్యాతో చేసుకున్న నిర్యుద్ధ సంధిని తుంగలో తొక్కుతూ ఎర్ర నేలను కబళించడానికి దండయాత్ర చేసి తన కలలను తానే కల్లలుగా మార్చుకున్నాడు. సోవియట్ ఎర్ర సేనలు తూర్పు వైపు నుండి కదం తొక్కుతూ బర్లిన్ నగరాన్ని పాదాక్రాంతం చేసుకుంటున్న…