వెనుకబాటుతనం నిర్ధారణ -ది హిందు ఎడిటోరియల్

విద్య, ఉద్యోగ రంగాలలో నిర్దిష్ట కులాలకు కేటాయించిన రిజర్వేషన్ ఫలాల పంపిణీని ఒక్కోసారి సామాజిక-విద్యా వెనుకబాటుతనం కాకుండా రాజకీయ సమీకరణలు నిర్ణయిస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వ ఒ.బి.సి (ఇతర వెనుకబడిన కులాలు) జాబితాలో జాట్ లను చేర్చుతూ చేసిన నిర్ణయాన్ని కొట్టివేస్తూ…, రిజర్వేషన్ కోటాల లబ్దిదారులను నిర్ణయించడంలో “తమను తాము సామాజికంగా వెనుకబడినవారిగా ప్రకటించుకోవడాన్ని” అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వెళ్ళే వైఖరిపై అనంగీకారం ప్రకటించింది. తొమ్మిది రాష్ట్రాల వ్యాపితంగా విస్తరించిన జాట్ లు ఉత్తర భారతంలోని అనేక…