హిందూత్వ ముఠాలు ఉపరాష్ట్రపతి మాటలు వినాలి!

ఇటీవల కాలంలో క్రైస్తవ మతం అనుసరిస్తున్న ప్రజలపై దాడులు పెరిగాయి. హిందూ మతం పేరు చెప్పుకుని వివిధ రౌడీ మూకలు ఈ దాడుల్లో పాల్గొంటున్నాయి. తమ దాడులకు న్యాయ బద్ధత, నైతిక సమర్థత కల్పించుకునేందుకు మత మార్పిడి జరుగుతోందని, దాన్ని అడ్డుకుంటున్నామని సాకు చెబుతున్నారు. కొన్నిసార్లయితే బహిరంగంగానే పర మత విద్వేషం చాటుకుంటున్నారు. మధ్య యుగాల నాటి శైవ, వైష్ణవ ఊచకోతలు, ఆసియా-ఐరోపాల్లోని క్రైస్తవ క్రూసేడ్లను తలపిస్తూ ముస్లింలు, క్రైస్తవులపై దాడులకు తెగబడుతున్నారు. కర్ణాటక బి‌జే‌పి ఎం‌పి…

రాజీనామా చేయమని జైట్లీకి మోడి సంకేతం?!

ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ -డి‌డి‌సి‌ఏ- అధ్యక్షులుగా 13 సంవత్సరాలు, ప్యాట్రన్-ఇన్-చీఫ్ గా ఒక సంవత్సరం పదవులు నిర్వహించిన ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, అవినీతి ఆరోపణల నేపధ్యంలో, రాజీనామా చేయవలసి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడి సంకేతం ఇచ్చారా? బి.జె.పి పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో నరేంద్ర మోడి చేశారంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పత్రికలకు చెప్పిన వ్యాఖ్యలు ఈ అనుమానాన్ని కలిగిస్తున్నాయి. “ప్రధాన మంత్రి ఎల్.కె.అద్వానీ ఉదాహరణను ప్రస్తావించారు. అప్పటి ప్రభుత్వం…

కాస్త అసహనం ఉన్నది నిజమే -వెంకయ్య

‘ఎక్కడ అసహనం, ఆయ్?’ అని దబాయించిన వారికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం వెంకయ్య నాయుడు సమాధానం ఇచ్చారు. అసహనంపై రాజ్య సభలో జరిగిన చర్చలో పాల్గొంటూ ఆయన “మన సమాజంలో ‘కొంత మొత్తంలో’ అసహనం ఉన్నమాట నిజమే. దానిని గుర్తించి దానితో కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉన్నది” అని వెంకయ్య అంగీకరించారు. తన ఒప్పుకోలు -పాక్షికంగానే అయినా- ద్వారా  ఆయన దేశంలో అసహనమే లేదు పొమ్మని నిరాకరించిన హిందూత్వ నేతలకు గట్టి షాక్ ఇచ్చారు.…

జి.డి.పి వృద్ధి: కాదు కాదు, మా వల్లే -వెంకయ్య

10 త్రైమాసికాల తర్వాత మొట్ట మొదటిసారిగా 2014-15 మొదటి త్రైమాసికంలో భారత ఆర్ధిక వృద్ధి రేటు 5.7 శాతం నమోదు చేసింది. ఇది తమ విధానాల వల్లనే అని మాజీ ఆర్ధిక మంత్రి పి.చిదంబరం మొన్న జబ్బ చరుచుకున్న సంగతి విదితమే. చిదంబరం సంతోషానికి బి.జె.పి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అడ్డుకట్ట వేశారు. కాంగ్రెస్ నేత అంతగా సంతోషపడడానికి ఏమీ లేదని జి.డి.పి తమ బి.జె.పి ప్రభుత్వం వల్లనే పెరిగిందని పోటీకి వచ్చారు. తాము అధికారంలోకి…

కాంగ్రెస్ గవర్నర్ల గెంటివేత -కార్టూన్

“రాజీనామా? అబ్బే కాదు. గెంటేశారు!!” *** కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పాత ప్రభుత్వం తాలూకు వాసనలను వదిలించుకోవాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల గవర్నర్ లను మార్చడానికి మోడి ప్రభుత్వం పావులు కదుపుతోంది. అయితే కొందరు గవర్నర్ లు అందుకు సహకరించడానికి సిద్ధంగా లేరు. దానితో బి.జె.పి మండిపడుతోంది. ముఖ్యంగా కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహా రాష్ట్ర రాష్ట్రాల గవర్నర్లు తమకు రాజీనామా చేసే ఉద్దేశ్యం ఏమీ లేదని స్పష్టం చేయడంతో…

ల్యాప్ టాప్‌ విసిరేస్తూ, చెంప ఛెళ్ళుమనిపిస్తూ, పదవీవియోగ నైరాశ్యంలో యెడ్యూరప్ప

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న బి.ఎస్.యెడ్యూరప్ప పదవీ వియోగంతోనో మరి దేనివల్లనో అదుపు తప్పినట్లు కనిపిస్తోంది. బి.జె.పి మాజీ అధ్యక్షుడూ వెంకయ్య నాయుడు ల్యాప్ టాప్‌ లాక్కొని మరీ నేలకు విసిరికొట్టి ఆయనపై యెడ్యూరప్ప ఆగ్రహం ప్రకటించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇంటివద్ద తనను కలవడానికి వచ్చిన పార్టీ నాయకుడొకరిని చెంప ఛెళ్ళుమనిపించిన సంగతి కూడా ఆ పత్రిక వెల్లడించింది. ఇండియా టుడే కధనం ప్రకారం, యెడ్యూరప్ప తనకు మద్దతు…