న్యూయార్క్ లో బ్యాంక్సీ వీధి చిత్రాల జాతర

చాలా కాలంగా బ్యాంక్సీ వీధి చిత్రాల సందడి కళా ప్రియులకు కరువైపోయింది. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ II సింహాసనం అధిష్టించి 60 యేళ్ళు పూర్తయిన సందర్భంగా బాల కార్మికుడు బ్రిటిష్ పతాకాన్ని మిషన్ పై కుడుతున్న బొమ్మను గీసిన తర్వాత మళ్ళీ బ్యాంక్సీ జాడ లేదు. మళ్ళీ ఇన్నాళ్లకు “Better Out Than In” శీర్షికతో అక్టోబర్ నెల అంతా న్యూయార్క్ నగరంలోని పలు చోట్ల వీధి చిత్రాలు గీసి పలువురు కళా ప్రియులకు విస్మయానందాలను పంచి…

బేంక్సీ వీధి చిత్రాలు -పునః ప్రచురణ

(ఈ ఆర్టికల్ ఏప్రిల్ 29, 2012 తేదీన ప్రచురించినది. అప్పటికీ ఇప్పటికీ పాఠకులు చాలామంది మారారు. చాలామంది కొత్త పాఠకులు వచ్చి చేరారు. అద్భుతమైన వీధి చిత్ర కళాకారుడు బ్యాంక్సీని కొత్త పాఠకులకు పరిచయం చేద్దామన్న ఉద్దేశ్యంతో -బ్యాంక్సీ అంటే నాకు చాలా చాలా చాలా చాలా ఇష్టం మరి!- దీనిని పునర్ముద్రిస్తున్నాను. -విశేఖర్) — — — ప్రఖ్యాత బ్రిటిష్ వీధి చిత్రకారుడు బ్యాంక్సీ గీసిన వీధి చిత్రాలివి. బ్యాంక్సీ చిత్రాల్లో కొట్టొచ్చినట్లు కనపడేది ‘అధారిటేరియనిజం’…

అబద్ధాన్ని పదే పదే చెబితే అది…. -మొగుల్ స్ట్రిట్ ఆర్ట్

బేంక్సీ అంత కాకపోయినా ఆ తరహాలో చిత్రకళను అభ్యసిస్తున్న వీధి చిత్రకారుల్లో మొగుల్ ఒకరు. స్వీడ దేశస్ధుడయిన మొగుల్ గీసిన ఈ వీధి చిత్రం స్టాక్ హోం నగరంలొని ఒక గోడ మీద గీసినది. అబద్ధాన్ని పదే పదే చెబితే నిజం అవుతుందని మనకు తెలిసిన సామెత. రాజకీయ నాయకులు అబద్ధాని నిజం చేసే కళను తమ వ్రుత్తిగా స్వీకరించారని మొగుల్ వీధి చిత్రం సూచిస్తోంది. అదెంత నిజమో ఎల్లరకు తెలిసిందే కదా.  నాలుగుకోట్ల కుతుంబాలకు ఉపాధి కల్పించే చిల్లరవర్తకంలో…

‘లండన్ ఒలింపిక్స్ 2012’ స్ట్రీట్ ఆర్ట్ -ఫోటోలు

ప్రఖ్యాత వీధి చిత్రకారుడు బ్యాంక్సీ, లండన్ లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్న సందర్భంగా రెండు వీధి చిత్రాలను తన వెబ్ సైట్ లో ప్రదర్శించాడు. ఈ చిత్రాలు ఏ వీధిలో ఉన్నదీ ఇంకా ఎవరికీ తెలిసినట్లు లేదు. బ్యాంక్సీ కూడా ఆ వివరాలేవీ చెప్పలేదు. (ఆ మాటకొస్తే తన వెబ్ సైట్ లో ఆయన ఉంచిన ఏ చిత్రానికీ వివరాలు లేవు.) వెబ్ సైట్ లో ప్రదర్శించేదాకా ఆ చిత్రాల సంగతి ఎవరికీ తెలిసినట్లు కూడా కనిపించడం…

చెక్క చెక్కిన చిత్రాలు -ఫొటోలు

ప్రముఖ పోర్చుగీసు కళాకారుడు ‘అలెగ్జాండ్రె ఫార్టో’ అలియాస్ ‘విల్స్’ చెక్కిన బొమ్మలివి. తీసి పారేసిన చెక్కల ఉపరితలాలను క్రమ పద్ధతిలో చెక్కడం ద్వారా పోర్ట్రయిట్ లను సృజించడాన్ని ఈ ఫొటోల్లో చూడవచ్చు. కొంచెం పరిశీలిస్తే ఇళ్లు లేదా ఆఫీసుల గోడలకి ఉపయోగించిన చెక్కలపైన ఈ చిత్రాలు చెక్కినట్లు కనిపిస్తొంది. పశ్చిమ దేశాల్లో  చెక్క ఇళ్లు ఎక్కువ గనక ఇలా భావించవలసి వస్తోంది. అలెగ్జాండ్రె వయసు 24 సం. మాత్రమే. 2008లో లండన్ లో జరిగిన కేన్స్ ఫెస్టివల్…

పాడుబడిన ఇల్లు, కాదు కాదు… స్ట్రీట్ అక్వేరియం -వీధి (వి)చిత్రం

స్పెయిన్ కళాకారుడు డిమిట్రిస్ టాక్సిస్ సృష్టి ఇది. ‘కార్నెల్లా డి లాబ్రెగాట్’ అనే పేరుగల పట్నంలో రోడ్డు పక్కన ఉన్న పాడు బడిన ఇంటిని ‘స్ట్రీట్ అక్వేరియం’ గా మార్చేశాడు. బైటి గోడలకు కూడా రంగులు వేసినట్లయితే అక్వేరియం లుక్ ఇంకా బాగా వచ్చి ఉండేది. కాని, అలా చేస్తే పాడు బడిన ఇల్లు అని తెలిసేది కాదు. ‘ఒరిజినల్ లుక్’ కీ ‘కళాత్మక దృష్టికీ’ మధ్య సమతూకం పాటించడానికి కళాకారుడు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.   –…

‘పావెల్ పుహోవ్’ వీధి చిత్రాలు -ఫొటోలు

రష్యా దేశానికి చెందిన వీధి చిత్రకారుడు ‘పావెల్ పుహోవ్’ గీసిన వీధి చిత్రాలివి. వీధి చిత్రకారులకి ప్రత్యేకంగా నిర్ధిష్టమైన కాన్వాస్ అంటూ పరిమితి లేకపోవడంతో వారి సృజనాత్మకతకు కూడా హద్దులు ఉండనట్లు కనిపిస్తోంది. ఓ కరెంటు స్తంభం ఆధారం చేసుకుని కళ్లజోడుని సృష్టించిన చిత్ర కారుడి సృజనను గమనిస్తే ఆ విషయం స్పష్టం అవుతోంది. – –

2డి తో 3డి ఎఫెక్ట్ -వీధి చిత్రం

ఇక్కడ ఉన్న ఫొటోల్లో మొదటిది పూర్తి చేసిన వీధి చిత్రం. ఆ తర్వాత ఉన్నవి ఆ చిత్రం గీస్తున్న క్రమంలో వివిధ దశలు. చివరి బొమ్మను చూస్తే గానీ ఇందులో మర్మం అర్ధం కాదు. మీరూ ఓ సారి పరిశీలించండి. – – – Ninja1 మరియు Mach505 లు ఈ చిత్ర గీశారట. –

‘ఎల్ మేక్’ వీధి పోర్ట్రయిట్లు -ఫొటోలు

‘ఎల్ మేక్’ అమెరికా దేశస్ధుడు. 1980 లో జననం. చిన్నతనం నుండీ బొమ్మలు గీస్తూ స్వతంత్రంగా అధ్యయనం చేస్తూ వచ్చాడట. మనుషుల బొమ్మలు ముఖ్యంగా ముఖాలపైన ఇతను ప్రధానంగా కేంద్రీకరించినట్లు కనపడుతోంది. మెక్సికో, అమెరికాల సంస్కృతి నుండి స్ఫూర్తి పొందినట్లు ఆయన చెప్పుకున్నాట్లు తెలుస్తొంది. నైరుతి అమెరికా సంస్కృతి, మతపరమైన చిత్రలేఖనం, గ్రాఫిటి లతో పాటు అనేక రకాల సాంప్రదాయక చిత్ర కళను ఈయన అధ్యయనం చేశాడు. అనేక దేశాల్లో ఈయన వీధి చిత్రాలు గీసాడు. మెక్సికో,…

అమోఘం, అద్భుతం, అసంభవం -వీధి చిత్రం ఫొటో

మై గుడ్ నెస్! ఈ వీధి చిత్ర కళాకారుల ప్రతిభకు అంతం లేనట్లుంది. వీధి చిత్రంగా భావించడానికి కూడా అసాధ్యంగా ఉన్న ఈ చిత్రాన్ని గీసింది మాయా క్లిల్, ఇమూమ్ కోలి అని తెలుస్తోంది. వారీ ఊరు తెలియలేదు. ఫేస్ బుక్ పేజీ ఉన్నా అందులో వివరాలు లేవు. – –

3-డి వీధి చిత్రం సిద్ధం, ఇదిగో ఇలా -వీడియో

“ఇంకొన్ని వీధి చిత్రాలు” అంటూ నేను ప్రచురించిన వీధి చిత్రాల పోస్టు కింద నేను, వేణు గారూ త్రి-డి చిత్రాలను ఎలా గీస్తారబ్బా అని ‘హ్యాశ్చర్యపడి’ పోయాం. అందులో ‘హాశ్చర్యపడ్డానికి’ ఏమీ లేదు అని మిత్రుడు కెవిన్ ఒక వీడియోని తన వ్యాఖ్యలో ప్రచురించారు. ఇందులో త్రి-డి చిత్రాలు మనకు అలా ఎందుకు కనిపిస్తాయో వివరణ ఉంది. కెవిన్ ఇచ్చిన వీడియోని పట్టుకొని వెళ్తే ఇదిగో, ఈ వీడియో కూడా కనపడింది. మా హాశ్చర్యాన్ని నివృత్తి చేసిన…

ఇంకొన్ని యూరోపియన్ వీధి చిత్రాలు -ఫొటోలు

యూరోపియన్ వీధి చిత్రాల్లో కనిపిస్తున్న త్రీ డైమెన్షనల్ ఎఫెక్టు చాలా అబ్బురపరిచే విధంగా ఉంటోంది. ఉదాహరణకి కింది ఫొటోల్లో ఎనిమిదవ ఫొటో చూడండి. ఆ బొమ్మ నిజానికి నేలపైన గీసిందే. బొమ్మ చివర స్త్రీ కూర్చుని ఉంది. కానీ చూస్తుంటే పులి నిజాంగా నిల్చుని ఉన్నట్లూ, స్త్రీ ఆ పులిపైన కూర్చుని ఉన్నట్లూ కనిపిస్తోంది. అలాగే పదకొండవ ఫొటో కూడా. ఇది నిజానికి సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ త్రీ-డి ఎఫెక్టు ఎలా వచ్చిందన్నదీ ఓ పట్టాన అర్ధం…

యూరోపియన్ వీధి చిత్ర కళ -ఫొటోలు

యూరప్ లోని వివిధ దేశాల నుండి సేకరించిన వీధి చిత్రాలు ఇవి. ఎంత సృజనాత్మకంగా ఉన్నాయో చూడండి. త్రీ డైమెన్షనల్ చిత్ర కళ అందునా వీధుల్లో ప్రదర్శించడం, ప్రదర్శించి మెప్పించడం ఎంతో సులువుగా చేశారు వీళ్ళు. – –

ఇంగ్లండ్ వీధి చిత్రకారుడి కళ -ఫొటోలు

BANKSY (బేంక్సి) ప్రసిద్ధి చెందిన వీధి చిత్ర కళాకారుడు. ఈయన సినిమాలకు దర్శకత్వం వహిస్తాడు. పెయింటర్ కూడా. ఇతని వీధి చిత్రాలు చాలా బాగుంటాయి. అందంగా, ఆలోచించేవిగా, వ్యంగ్యాత్మకంగా ఇలా చాలా రకాలుగా చిత్రాలు గీయగలడు. “షాప్ టిల్ యు డ్రాప్” అనే షాపు కోసం ఆయన ఆ షాపు గోడపైన గీసిన చిత్రం చూడండి. – –