మాకీ యుద్ధం వద్దు బాబోయ్ -ఉక్రెయిన్ మహిళలు (వీడియో)

తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాల మీద అమానుషంగా దాడి చేస్తున్న ఉక్రెయిన్ ప్రభుత్వం ఉక్రెయిన్ యువకులను బలవంతంగా యుద్ధ క్షేత్రానికి తరలిస్తోంది. ఉక్రెయిన్ సైన్యాలు ఫైటర్ జెట్ లతో ఇళ్ళు, భవనాలు, పాఠశాలలు, హోటళ్లు, కాలేజీలు… ఇలా కనపడిందల్లా కూల్చివేస్తుండడంతో డొనేట్స్క్, లుగాన్స్క్ రాష్ట్రాలు తీవ్రమైన మానవతా సంక్షోభం (humanitarian crisis) లో ఉన్నాయి. పెద్ద మొత్తంలో ప్రజలు సరిహద్దు దాటి శరణార్ధులుగా రష్యాకు తరలిపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తూర్పు ఉక్రెయిన్, ఉక్రెయిన్ కు మరో గాజా…

తిక్కవెధవలతో వాదన చేటు తెస్తుంది -వీడియో

తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు దవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు. చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు ఈ పద్యం ఎవరు రాశారో నాకు గుర్తు లేదు గానీ ఇప్పటికీ ఆచరణీయం అని మూర్ఖ, తిక్క శిఖామణులు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంటారు. అంతర్జాలం చాటు చూసుకుని తిక్క వ్యాఖ్యలు పోస్ట్ చేస్తున్న తల తిక్క వెధవల నుండి శాశ్వతంగా తప్పించుకునే మార్గం ఏమిటా అని ఆలోచిస్తుండగా ఫేస్ బుక్ లో యాదృచ్ఛికంగా…

ఆపదలో స్త్రీని ఎందరు ఆదుకుంటారు? -ప్రయోగం (వీడియో)

“YesNoMaybe” అన్న పేరుతో ఓ ఫిల్మ్ మేకింగ్ సంస్ధ ఉంది(ట). ఆ సంస్ధ వాళ్ళు ఈ మధ్య ఒక ప్రయోగం చేశారు. ఢిల్లీ బస్సు అత్యాచారానికి వ్యతిరేకంగా లక్షలమంది దేశవ్యాపితంగా స్పందించారు. కొవ్వొత్తులు వెలిగించి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ప్లకార్డులు రాసుకుని ఊరేగింపులు నిర్వహించారు. ఢిల్లీలోనైతే ఏకంగా పోలీసులతో యుద్ధమే చేశారు. అయితే నిజంగా ఒక స్త్రీ ఆపదలో ఉండి ఆర్తనాదం చేస్తే ఆమెను ఆదుకోవడానికి ఎంతమంది ముందుకు వస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి “YesNoMaybe”…

ఆ చల్లని సముద్ర గర్భం -శ్రామికుడి నోటి పాట

ఈ పాటను నేను చాలాసార్లు విన్నాను. పాడటంలో అనుభవం ఉన్నవారి నోట విని తన్మయం చెందాను. వారిలో చాలా మంది చూసి పాడేవాళ్లు. చూడకుండా పాడితే తప్పులు పాడేవాళ్లు. కొంతమంది పాడుతూ ఉండగానే శృతి తప్పేవాళ్లు. మళ్ళీ అందుకోడానికి యాతన పడేవాళ్లు. కానీ మొదటి సారి ఈ పాటని ఒక శ్రమ జీవి నోటి నుండి వింటున్నాను. పాటలోని పదజాలం పుస్తకాల్లో మాత్రమే దొరికేది. జానపదం లాగా పల్లె పదాలు కావవి. సంస్కృత పదాలు కలిసి ఉన్న…

గిరిజనాల పరిస్ధితికి దర్పణం ఈ పాట -వీడియో

భారత దేశంలో అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న జీవన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ దేశ సహజ మౌలిక ఖనిజ వనరులను దేశ ప్రజలకు వినియోగ పెట్టడం మాని తవ్వి విదేశీ కంపెనీలకు ముడి పదార్ధాలుగా దేశం దాటిస్తున్నారు. ఆ క్రమంలో తరాల తరబడి అడవులు, కొండలను నమ్ముకుని బతుకుతున్న పేద గిరిజన రైతు కూలీలు కొంపా, గోడు దోపిడీదారులకు అప్పజెప్పి తమకు పరిచయం లేని మైదాన ప్రాంతాల్లో పని…

‘బోస్టన్ ఆక్రమిద్దాం’ ఉద్యమ అతి పెద్ద ర్యాలి -వీడియో

సెప్టెంబరు 30 తేదీన అమెరికాలోని బోస్టన్ నగరంలో వివిధ ప్రాంతాల వద్ద ప్రదర్శనలు నిర్వహించారు. ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి కారణభూతులైన వాల్‌స్ట్రీట్ కంపెనీలకు పెద్ద మొత్తంలో బెయిలౌట్లు పంచిపెట్టిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ బోస్టన్ శాఖ ముందు అందోళనకారులు భారీ ప్రదర్శన నిర్వహించారు. హైస్కూల్ విద్యార్ధులనుండి యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరకూ పాల్గొన్న ఈ ర్యాలికి పోలీసులు కాపలా కాశారు. వికలాంగులు సైతం పాల్గొన్న ఈ ఊరేగింపు తర్వాత బోస్టన్ నగరం నుండి అనేకమంది ఇతర నగరాలకు వెళ్ళి…

లిబియాలో నాటో ‘యుద్ధ నేరాలకు’ పాల్పడినమాట నిజం -వీడియో

గ్లోబల్ రీసర్చ్ సంస్ధ తన వెబ్‌సైట్ లో ఈ వీడియోను ప్రచురించింది. లిబియా ప్రజలకోసం నాటో బలగాలు వైమానిక దాడులు, బాంబు దాడులు చేశాయని పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు తెంపు లెకుండా అబద్ధాలు ప్రచారం చేశాయి. వారి బాంబుదాడుల్లో పౌరులు మరణించిన ఘటనలకు సమాధానం ఇవ్వకపోగా, యుద్ధంలో అనుబంధ నష్టం సహజమేనని అహంకార పూరితంగా బదులిచ్చారు. తద్వారా లిబియాపై తాము సాగిస్తున్నది యుద్ధమేనని అంగీకరించారు. కాని ఫ్రాన్సు, అమెరికా, బ్రిటన్ లు ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు…

టీనేజి కుర్రాడిని నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపిన పాక్ ఆర్మీ -రాయిటర్స్ వీడియో లింక్

సర్ఫరాజ్ షా అనే పేరుగల యువకుడిని పాకిస్ధాన్ పారామిలట్రీ రేంజర్స్ కి చెందిన పోలీసులు, అతను ఓ వైపు దీనంగా బతిమాలుతున్నప్పటికీ క్రూరంగా కాల్చి చంపిన దృశ్యం ఈ వీడియోలో చూడవచ్చు. పోలీసులకి, సైనికులకి అధికారం అప్పగిస్తే ప్రజలు ఏం అనుభవించాల్సి వస్తుందో ఈ వీడియో తెలియజెప్పుతోంది. పాక్ ప్రధాని యధావిధిగా, విచారించి దోషులను కఠినంగా శిక్షిస్తామని వాగ్దానం ఇచ్చేశాడు. ఆయన వాగ్దానాన్ని నమ్మినవారెవరూ లేరని పత్రికలు ఘోషిస్తున్నాయి. http://in.reuters.com/video/2011/06/10/outrage-over-point-blank-teen-killing-in?videoId=212787889&videoChannel=101