దుః ఖైర్లాంజి -ఎండ్లూరి సుధాకర్ కవిత

(దిన, వార పత్రికలు చదివే వారికి డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ పేరు చిరపరిచతమే. ఆయన రాసిన ఈ కవిత వెబ్ మహిళా సాహిత్య పత్రిక ‘విహంగ‘ లో ఫిబ్రవరి 1 తేదీన ప్రచురించబడింది. పత్రిక సంపాదకుల అనుమతితో ఇక్కడ పునర్ముద్రిస్తున్నాను. -విశేఖర్) ఆ రాత్రి ఆకాశం నెత్తుటి వెన్నెల కురిసింది ఆ రాత్రి మట్టి మాంసం ముద్దగా మారింది ఆ రాత్రి నిలువెత్తు నీలి విగ్రహం నీరై పోయింది ఆ రాత్రి ఆత్మ గౌరవం ఆయుధంకాలేక విలపించింది…