మీ మౌనం ఇక ఎంతమాత్రం పరిష్కారం కాదు -కవిత

(విశాఖ జిల్లా ప్రగతిశీల మహిళా సంఘం (POW) వారు 1990లో ఒక పుస్తకం ప్రచురించారు. కుటుంబ హింసకు, వరకట్న హత్యకు, లాకప్ హత్యకు, అత్యాచారాలకు గురయిన వివిధ మహిళల కోసం వారు చేసిన కృషిని విశ్లేషణాత్మకంగా ఈ పుస్తకంలో వివరించారు. దాదాపు అన్ని రంగాలలోని -కూలీలు, ఫ్యాక్టరీ కార్మికులు, ప్రొఫెసర్ల కూతుళ్ళు, బ్యాంకర్ల భార్యలు, ఉద్యోగుల కోడళ్ళు…ఇలా వివిధ తరగతులకు చెందిన మహిళలు పురుషాధిక్య వ్యవస్ధ పాటించే వివక్షను, అణచివేతను, హింసను, చివరికి హత్యలను ఎదుర్కొంటున్నారని విశాఖ…

ఇంకా వెన్నాడుతున్న ప్రమాదాలు -ది హిందు ఎడిట్

భారత నౌకా బలగం, స్వల్ప కాల విరామం అనంతరం, ప్రమాదాల నిలయంగా కొనసాగుతూనే ఉంది. గత వారమే సహాయక నౌక ఒకటి విశాఖపట్నం తీరంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటన ఒక నావికుడి ప్రాణాన్ని బలి తీసుకోగా, మరో నలుగురు ఆచూకీ దొరకని వారుగా ప్రకటించబడ్డారు. వైజాగ్ సమీపంలో ఒక వాణిజ్య నౌక ఢీ కొట్టడంతో ఐ.ఎన్.ఎస్ కోరా అనే క్షిపణి యుద్ధ నావ స్వల్ప నష్టానికి గురైన తర్వాత పక్షం రోజుల్లోనే ఇది రెండో ప్రమాద ఘటన.…

హుద్ హుద్: లెక్కించ అలవికాని నష్టం -ఫోటోలు

హుద్ హుద్ పెను తుఫాను వల్ల మూడు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంత నష్టం వాటిల్లిందో లెక్కించడం సాధ్యం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నష్టం 60 వేల కోట్లా లేక 70 వేల కోట్లా అన్నది తేల్చలేమని, అది ఇప్పుడప్పుడే సాధ్యం అయ్యే వ్యవహారం కాదని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పరిశీలకులు, విశ్లేషకులు ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. “నష్టం 60,000 కోట్లా లేక 70,000 కోట్లా అన్నది చెప్పడం చాలా కష్టం. సీనియర్ అధికారులు జరిగిన…

వైజాగ్ లో చంద్రబాబుకు ఎల్-బోర్డు -కార్టూన్

వాహన తోలకం (డ్రైవింగ్) నేర్చుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? తోలకం నేర్చుకుంటున్న వాహనానికి L-బోర్డు తగిలిస్తాం. రోడ్డు రవాణా విభాగం వాళ్ళు ఈ మేరకు నిబంధన విధిస్తారు. తోలకం నేర్చునేవారు తమ దరిదాపుల్లో ఉన్నప్పుడు ఇతర వాహనదారులు కాస్త జాగ్రత్తగా ఉండాలని ఎల్-బోర్డు సూచిస్తుంది. విభజనానంతర ఆంధ్ర ప్రదేశ్ కు రాజధాని నిర్మించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక ఆశలు కల్పించారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని కొన్నాళ్లు చెప్పారు. నయా రాయపూర్ నిర్మాణం బాగుందని కొన్నాళ్లు…

హుద్ హుద్ విలయం, 21 మంది మరణం -ఫోటోలు

హుద్ హుద్ పెను తుఫాను ఉత్తరాంద్రలోని మూడు జిల్లాలను అతలాకుతలం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ శాఖలన్నింటినీ కదిలించి ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో కేవలం ముగ్గురంటే ముగ్గురే మరణించారని ప్రతిపక్ష నాయకులతో సహా పత్రికలు రిపోర్ట్ చేసినప్పటికీ వాస్తవ మరణాల సంఖ్య సోమవారం నాటికి గాని తేలలేదు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ప్రకారం తుఫాను తాకిడికి మరణించినవారి సంఖ్య 21కి పెరిగింది. మరణించినవారిలో అత్యధికులు చెట్లు కూలడం వల్లనే మరణించారని…