ఈజిప్టు విమానం అదృశ్యం!

ఈజిప్టు విమానం ఒకటి మధ్యధరా సముద్రంపై ప్రయాణిస్తుండగా అదృశ్యం అయింది. ప్యారిస్ నుండి ఈజిప్టు రాజధాని కైరోకు తిరిగి వస్తుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రయాణానికి ముందు విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశామనీ, యాంత్రిక వైఫల్యం కారణం కావడానికి అవకాశాలు దాదాపు లేవని ఈజిప్టు ప్రభుత్వం, ఈజిప్టుఎయిర్ విమానయాన సంస్ధ ప్రకటించాయి. యాంత్రిక లోపం కంటే ఉగ్రవాద చర్యే ప్రమాదానికి కారణం అయి ఉండవచ్చని ఈజిప్టు ప్రభుత్వం చెబుతోంది. ఎయిర్ బస్ కంపెనీ తయారీ అయిన విమానం…

సముద్రంలోనే కూలింది, 6 మృత దేహాలు లభ్యం -ఫోటోలు

అనుకున్నట్లుగానే ఎయిర్ ఆసియా విమానం QZ 8501 విమానం జావా సముద్రంలోనే కూలిపోయిందని నిర్ధారణ అయింది. జావా సముద్రం లోని బోర్నియో ద్వీపానికి సమీపంలో విమానానికి సంబంధించిన అనేక శిధిలాలు కనపడడంతో ప్రమాదం నిర్ధారించబడింది. ప్రయాణీకులకు చెందిన 6 మృత దేహాలను రక్షణ సిబ్బంది వెలికి తీశారు. అనేకమంది ప్రయాణీకుల మృత దేహాలు ఇంకా విమానంలోనే ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. 40 మృత దేహాలను వెలికి తీశామని మొదట ఇండోనేషియా నౌకా బలగం ప్రకటించింది. అయితే అనంతరం…