తెరేష్ బాబు విభజన గీత -సంస్మరణ

కవి, తెలంగాణ రాష్ట్ర వాసి పైడి తెరేష్ బాబు గారు చనిపోయారని మిత్రుల ద్వారా తెలిసింది. ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయం లేదు. కానీ ఉద్యమ భావజాల సంబంధం వ్యక్తిగత పరిచయాలకు అతీతమైనది. ఆ కారణం వలన ఆయనకు నాకు మధ్య భావాత్మక వారధిగా నిలిచిన ‘విభజన గీత’ను, సంస్మరణ కోసం పునర్ముద్రిస్తున్నాను. పీడిత జనం ప్రపంచంలో ఏమూల ఉన్నా వారికి కూడా తెలియని ఒక సార్వజనీన ఏకత్వం వారి మధ్య ఏర్పడిపోయి ఉంటుంది. అది ఒక్కోసారి…

విభజన గీతా మకరందం

-రచన: పైడి తెరేష్ బాబు (పైడి శ్రీ) మ్యాచ్చోహి ఫిక్సింగహ కిం కరిష్యోపి జగద్విదితహతహ తీర్మాణాం అవిశ్వాసపి రక్షతి ప్రతిపక్షాం అనుభవిష్యతి అపార్థా! గతమున మేసిన దొంగగడ్డి కారణమున, చిప్పకూడు ఎచట తినవలసి రావచ్చునో యను భయము వలన, కేంద్ర, రాష్ట్ర పాలకపక్షముతో లోపాయికారీ మాచ్ ఫిక్సింగులకు పాల్పడి, శాసనసభయందు అవిశ్వాస తీర్మానము వీగిపోవునటులజేసి, ప్రజాకంటక ప్రభుత్వమును కాపాడిన ప్రధాన ప్రతిపక్షము వారే… మాచ్ ఫిక్సింగుల గురించి నేడు విమర్శించుచున్నారు. ఇది చిత్రములలోకెల్ల భళారే విచిత్రము. రథము…

విభజన ‘గీత’ -మరిన్ని శ్లోకాలు

రచన: తెరేష్ బాబు పైడి (పైడిశ్రీ) “బల్బో బస్సాహి సమ్మ్యామ్యహం దీక్షో భగ్నాయ వినిర్గతీ!!!” అపార్థా…! ఆరే ప్రతి బల్బు వెలగక తప్పదు ఆగే ప్రతి బస్సు కదలక తప్పదు జరిపే ప్రతి సమ్మె ఆపక తప్పదు చేసే ప్రతి దీక్ష భగ్నం కాక తప్పదు ఇవన్నియు ఢిల్లీ వలననే సంభవించుచున్నవి టీ టిటిటి ట్యూం టుయ్ [ఇది వీణా నాదము] ***                ***                *** కోతోహి చింపాంజీ నక్కస్య గోతో! మంత్రామ్యహి ముఖ్యోతి! జీవస్య ఎంజీవం…

విభజన ‘గీత’ -తమాషా శ్లోకం

ఇది ఫేస్ బుక్ లో లభించింది. చాలా తమాషాగా ఉంది. కొంత అరాచకం అనిపిస్తున్నప్పటికీ ఇందులో వ్యక్తమయిన సృజనాత్మకత మాత్రం బాగుంది. మీరే చదవండి! పేరెంట్సో జన్మహ పేమెంట్సో విద్యతి! వన్ బై వనేస్య వరసస్య సంభవామి దగే దగే! ఇంతోహి బతుకు ఇంటెనక మరణస్య! చర్చా ప్రహసనన కరిష్యాం జిల్ జిల్ జిగే!!!! అపార్థా! పేరెంట్స్ వలన జన్మము, పేమెంట్స్ వలన చదువు, చదువు వలన ఉద్యోగము, ఉద్యోగము వలన లంచము, లంచము వలన నేరము,…