స్వదేశీ విదేశీ అప్పులూ, సార్వభౌమ ఋణ పత్రాలూ… -ఈనాడు

“పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్” అంటాడు గిరీశం మహాకవి గురజాడ వారి కన్యాశుల్కం నాటకం నాటకంలో. పొగ తాగడం అనివార్యం అన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆనక ఆ ప్రాతిపదికన తన అలవాటును గొప్పదిగా ఎస్టాబ్లిష్ చేయడానికి గిరీశం ఆ మాట చెప్పాడు. అప్పు సంగతి దాదాపు అలాంటిదే. పొగ అవసరం లేకపోయినా ఉందని గిరీశం ఎస్టాబ్లిష్ చెయ్యబోయాడు. అప్పు అవసరం మాత్రం నిజంగానే అనివార్యం. ఎందుకని అనివార్యం? నిజానికి ఎవరి శ్రమకు తగిన సంపాదన వారికి…

ఇండియా విదేశీ అప్పు రు. 23.4 లక్షల కోట్లు

2013 మార్చి మాసాంతానికి భారత దేశ విదేశీ అప్పు 390 బిలియన్ డాలర్లని ఆర్.బి.ఐ తెలిపింది. డాలర్ కి 60 రూపాయల లెక్కన ఇది 23.4 లక్షల కోట్ల రూపాయలకు సమానం. అంతకు ముందరి ఆర్ధిక సంవత్సరం (2011-12) తో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువని తెలుస్తోంది. స్వల్ప కాళిక వాణిజ్య రుణాలు, విదేశీ వాణిజ్య రుణాలు బాగా పెరగడంతో విదేశీ అప్పు విపరీతంగా పెరిగిందని ఆర్.బి.ఐ గురువారం తెలిపింది. కరెంటు ఖాతా లోటు పూడ్చుకోడానికి…