రద్దయ్యేది సన్నకారు రుణాలా, కార్పొరేట్ రుణాలా?

“ముందు మాల్యాని పట్టుకోండి…” ఆర్టికల్ కింద విన్న కోట నరసింహారావు గారి వ్యాఖ్యకు సమాధానంగా ఈ వ్యాసాన్ని చూడగలరు. ********* (బడా ఋణ గ్రహీతలను) “వదిలిపెట్టేస్తారు అనేది ఓ అపోహ. అసలు ఋణమాఫీ అన్నది సన్నకారు ఋణాల విషయంలోనే ఎక్కువ జరుగుతుంది.” ఇది విన్నకోట నరసింహారావు గారి వ్యాఖ్యలోని ఓ భాగం. జరుగుతున్న రాజకీయ రగడని అవకాశంగా తీసుకుని బాకీలు ఎగవేసే ధోరణి వల్ల దేశంలో ముఖ్య ఆర్ధిక సంస్ధలైన బ్యాంకుల వ్యవహారాలు ముందుకు సాగకుండా నిర్వీర్యం…

ముందు మాల్యాని పట్టుకోండి! -రైలు టికెట్ కొనని మహిళ

భారత పాలకుల ధనికవర్గ తత్వాన్ని ఒక మహిళ ఎండగట్టిన ఉదంతం చోటు చేసుకుంది. సహజంగా వివాదాలకు దూరంగా ఉండాలని భావించే ధనిక కుటుంబాలకు చెందిన మహిళ ఈ సాహసానికి పూనుకోవడం విశేషం. 44 సం.ల మహిళ ఆదివారం రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడింది. బహుశా ‘పట్టుబడింది’ అనడం సరైనది కాకపోవచ్చు. ఎందుకంటే ఆమె టికెట్ కొనలేనంత పేదరాలు కాదు. ‘పట్టుబడిన అనంతరం’ ఆమె టికెట్ కలెక్టర్ విధించిన జరిమానా చెల్లించడం కంటే జైలుకు వెళ్లడానికే సిద్ధపడడాన్ని…

ఈ యేటి నిరర్ధక ఆస్తులు లక్ష కోట్లు!

“ప్రపంచం అంతా ఆర్ధిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుంటే ఇండియా మాత్రం అద్భుతమైన ప్రగతి (ఆర్ధిక వృద్ధి) నమోదు చేస్తుంది. ఇది మా విధానాల వల్లనే సాధ్యపడింది….” ఇది ఈ మధ్య కాలంలో ప్రధాన మంత్రి మోడి తరచుగా చెబుతున్న మాట! ప్రధాని మాటలు వాస్తవమేనా? కాదు అని ఆర్ధిక మంత్రి ఇచ్చిన సమాచారం చెబుతోంది. రాజ్య సభలో అరుణ్ జైట్లీ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం ప్రకారం 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు -మొదటి…

విజయ్ మాల్యా ఎగవేసింది నీటి బొట్టంత! -మాజీ కాగ్

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, యునైటెడ్ బ్రూవరీస్… తదితర కంపెనీల అధినేత విజయ్ మాల్యా ఇప్పుడు భారత దేశంలోని అప్పు ఎగవేతదారులకు సింబల్! యునైటేడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యు.బి.ఐ), ఆయనను ఉద్దేశ్యపూర్వక పన్ను ఎగవేతదారు (Wilful defaulter) గా ప్రకటించినప్పటి నుండి ఆయనకు ఆ కీర్తి దక్కింది. బహుశా స్వతంత్ర భారత చరిత్రలో ఈ బిరుదు దక్కించుకున్న ఏకైక/మొట్టమొదటి పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాయే కావచ్చు. అయితే ఇంతటి కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకున్న విజయ్ మాల్యా,…

లిక్కర్ రారాజుకి కష్టాలట! కేంద్రం బెయిలౌట్ ఇచ్చి ఆదుకుంటుందట!!

ప్రజలకి కష్టాలొచ్చినపుడు ఆదుకోవాలనీ, వారికి బెయిలౌట్ ఇవ్వాలనీ ప్రభుత్వాలు భావించిన దృష్టాంతాలు చరిత్రలో దుర్భిణీ వేసినా వెతకినా కనపడవు. కాని జనాలకి మద్యం తాగబోసి, తెగమేసిన సొమ్ముల్ని బొక్కసంలో కుక్కుకుని, తమ మరో కంపెనీ ‘కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్’ కష్టాల్లో ఉందంటూ బీద అరుపులు అరుస్తున్న లిక్కర్ రారాజు విజయ్ మాల్యాకు బెయిలౌట్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధ పడుతోంది. ఐ.పి.ఎల్ ఫ్రాంచైజి ల్లో ఒకటయిన పంజాబ్ సూపర్ కింగ్స్ కి సొంతదారు కూడా అయిన విజయ్…