విజయనగరంలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కేంద్ర కేబినెట్, నోట్ ఆమోదించడానికి నిరసనగా విజయ నగరం అట్టుడుకుతోంది. ఏ.పి.ఎన్.జి.ఓ సంఘం ఇచ్చిన 48 గంటల బంద్ పిలుపు ముగిసినప్పటికీ మూడో రోజు కూడా అక్కడ ప్రజలు ఆగ్రహంతో వీధులకెక్కారు. కర్ఫ్యూ ప్రకటించినప్పటికి పరిస్ధితి అదుపులోకి రాకపోవడంతో ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు జారీ అయినట్లు ది హిందు తెలిపింది. ప్రజల ఆగ్రహం ప్రధానంగా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణపై కేంద్రీకృతం అయింది. పి.సి.సి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోనియా…