బ్లాడ్లీ మేనింగ్: 35 ఏళ్ళ శిక్షను 7 ఏళ్లకు కుదించిన ఒబామా
మరో రెండు రోజుల్లో అధ్యక్ష పదవి నుండి దిగిపోనున్న బారక్ ఒబామా, గత ఎనిమిదేళ్లుగా పాల్పడిన పాపాలకు చిన్న ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. వికీ లీక్స్ కు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల రహస్య సమాచారాన్ని అందజేసినందుకు మిలట్రీ కోర్టు మార్షల్ విధించిన 35 ఏళ్ళ కారాగార శిక్షను 7 సంవత్సరాలకు కుదిస్తూ ఉత్తర్వులపై సంతకం చేసాడు. ఫలితంగా 20 మిస్టర్ బ్రాడ్లీ మేనింగ్ ఉరఫ్ మిస్ చెలేసా మేనింగ్ 2045 లో విడుదల కావలసిన చెలేసా మేనింగ్ వచ్చే…