విచిత్ర అసాధారణ గృహాలు -ఫోటోలు

వెనకటికో పెద్దాయన పని లేక పిల్లి తల గొరగడం మొదలు పెట్టాట్ట. పని లేని పెద్దలు తల పైన జుట్టుని, మొఖం మీద వెంట్రుకల్ని విచిత్రమైన షేపులతో కత్తిరించే ఫ్యాషన్ ని కనిపెట్టారేమో ఎవరన్నా పరిశోధించి కనిపెట్టాలి. పనే లేదో, తెలివి ప్రదర్శనకు మరో మార్గమే దొరక లేదో తెలియదు గానీ కొందరు తాము నివసించే ఇళ్లను సైతం వినూత్నంగా నిర్మించి ప్రదర్శిస్తున్నారు. వారూ వీరని కాకుండా ఈ బాపతు మేధావులు లేదా కళా కారులు ప్రపంచం…