కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలపై గురువింద ధాకరే మండిపాటు

చూసే తీరిక ఉండాలే గానీ భారత రాజకీయ నాయకుల సర్కస్ విన్యాసాలకు, రెండు నాలుకల ప్రకటనలకు కొదవ ఉండదు. కొడుకు ఉద్ధవ్ ధాకరే తో పాటు మనవడు అధిత్య ధాకరేను కూడా శివసేన ఆధిపత్య స్ధానాలకు నామినేట్ చేసిన బాల్ ధాకరే కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలపై మండిపడుతున్నాడు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవి కోసం ఆశపడుతున్నాడనీ, ప్రియాంక గాంధీ మరో ఇందిరా గాంధీ లాగా రాజకీయాల్లో ఎదగలానుకుంటున్నదనీ వాపోయాడు. శివసేనలో మాత్రం అంతా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నదనీ…

నెం.1 స్ధానంలో రాహుల్ గాంధీ ఖర్చీఫ్

వారసత్వ రాజకీయాలకు భారత దేశం పెట్టింది పేరు. సొంత ప్రయోజనాల కన్నా నాయకుల పట్ల సానుభూతికి భారతీయులు ఎక్కువ విలువ కట్టబెట్టడం ఇక్కడ రివాజు. భర్త చనిపోతే భార్యకు, తండ్రి చనిపోతే కొడుకుకి సానుభూతి ఓట్లు కురిపించి పీకలమీదికి తెచ్చుకోవడానికి శ్రామిక జనం పెద్దగా ఫీలవరు. ఇక సానుభూతి రాజకీయాలను వ్యవస్ధాగతం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నెహ్రూ, ఇందిర, సంజయ్ రాజీవ్ లు, సోనియా… ఇప్పుడు రాహుల్. తెలివిగా రాజకీయ వయసుకు ఎంతో ముందుగానే రంగం…