ఒక కల్పనాత్మక ఒప్పందం -ది హిందు ఎడిట్
160 సభ్య దేశాల ప్రపంచ వాణిజ్య సంస్ధ (WTO) కు చెందిన జనరల్ కౌన్సిల్ గత వారం స్ధాపించబడ్డ 20 యేళ్ల కాలంలోనే మొట్టమొదటి అతి పెద్ద ప్రపంచ స్ధాయి ఒప్పందం ఆమోదించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఆహార నిల్వల సమస్య పరిష్కారం అయ్యేవరకూ వాణిజ్య వసతీకరణ ఒప్పందంపై సంతకం చేసేది లేదని నిరాకరిస్తూ న్యూ ఢిల్లీ కాలు అడ్డం పెట్టడంతో డబ్ల్యూ.టి.ఓ ప్రతిష్టంభన ఎదుర్కొంది. తత్ఫలితంగా ఉత్తన్నమైన జఠిల సమస్య వల్ల డబ్ల్యూ.టి.ఓ భవిష్యత్తే ప్రశ్నార్ధకం…