ఇ.యు, చైనాల వాణిజ్య యుద్ధం, మొదటి అంకం మొదలు

యూరోపియన్ యూనియన్ చెప్పినట్లుగానే చైనా సోలార్ విద్యుత్ ఉత్పత్తి పరికరాలపై దిగుమతి సుంకం పెంచడానికి నిర్ణయం తీసుకుంది. తద్వారా చైనాతో వాణిజ్య యుద్ధానికి తెర లేపింది. చౌక పరికరాలను పెద్ద ఎత్తున డంపింగ్ చేయడానికి వ్యతిరేకంగానే తాను అదనపు సుంకం విధిస్తున్నట్లు ఇ.యు ప్రకటించింది. సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే సోలార్ పానెళ్లు, బ్యాటరీలు, వేఫర్లు మొదలైన పరికరాలకు 12 శాతం అదనపు సుంకం వేయనున్నట్లు ఇ.యు ట్రేడ్ కమిషనర్ కారెల్ డి గచ్ మంగళవారం తెలిపాడు.…

చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం, అమెరికా ఎగుమతులపై చైనా అదనపు సుంకాలు

చైనా, అమెరికాల వాణిజ్య యుద్ధంలో మరో ముందడుగు పడింది. చైనా నుండి ఎగుమతి అవుతున్న గ్రీన్ ఉత్పత్తుల వలన అమెరికా గ్రీన్ ఉత్పత్తులకు నష్టం వాటిల్లుతున్నదంటూ అమెరికా ఉత్పత్తిదారులు ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకుని అమెరికా ప్రభుత్వం దర్యాప్తు కమిటీని నియమించిన తర్వాత చైనా ప్రతీకార చర్య చేపట్టింది. అమెరికానుండి కార్లు పెద్ద ఎత్తున డంప్ చేస్తున్నారని ఆరోపిస్తూ అక్కడి నుండి దిగుమతి అవుతున్న కార్లపైన చైనా వివిధ స్ధాయిల్లో అదనపు సుంకాలను విధించింది. అమెరికా కేవలం దర్యాప్తు…

గ్రీన్ టెక్న్లాలజీ రంగంలో అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం?

పర్యావరణ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వాణిజ్యంలో అమెరికా, చైనా ల మధ్య వాణిజ్య యుద్ధం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. చైనాకు చెందిన పర్యావరణ సాంకేతిక ఉత్పత్తులు అమెరికా కంపెనీల ఉత్పత్తులకు హానికరంగా పరిణమించాయని భావిస్తూ ‘అమెరికా ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్’ విచారణ చేయడానికి నిర్ణయించడంతో ఈ పరిస్ధితి ఏర్పడింది. అమెరికా చర్యలు వాణిజ్యంలో ‘రక్షణాత్మక విధానాలతో’ (ప్రొటెక్షనిజం) సమానమని చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇతర దేశాలనుండి వచ్చే దిగుమతులతో పోటీ పడలేక అటువంటి దిగుమతులపైన పెద్ద…

చైనా, అమెరికాల వాణిజ్య అసమతూకం -కార్టూన్

పశ్చిమ దేశాలు, చైనా పట్ల గుర్తుగా ఉండే ముఖ్యమైన అంశాల్లో వాణిజ్య మిగులు ఒకటి. ప్రతి నెలా చైనాతో యూరప్ దేశాలకు గానీ, అమెరికాకి గానీ వాణిజ్య మిగులు ఉండవలసిందే. అమెరికాతో చైనాకు గల వాణిజ్య మిగులు గురించి చెప్పనవసరం లేదు. ప్రతి సంవత్సరం కనీసం రెండొందల బిలియన్ డాలర్లవరకూ వాణిజ్య మిగులు చైనాకు ఉంటోంది. ఇది అమెరికాకి అస్సలు నచ్చడం లేదు. చైనా ఉద్దేశ్యపూర్వకంగా తన కరెన్సీ యువాన్ విలువను తక్కువగా ఉంచడం వలన చైనా…

ఆ చట్టం ఆమోదిస్తే ‘వాణిజ్య యుద్ధం’ తప్పదు, అమెరికాకి చైనా హెచ్చరిక

చైనా కరెన్సీ విలువ పెంపుదలపై అమెరికా కాంగ్రెస్ చట్టం చేయాలని పూనుకోవడాన్ని చైనా తీవ్రంగా ఖంచించింది. చైనా కృత్రిమంగా తన కరెన్సీ యువాన్ విలువను అతి తక్కువ స్ధాయిలో ఉంచుతున్నదని అమెరికా గత రెండు సంవత్సరాలుగా ఆరోపిస్తోంది. యూరప్, ఇండియాలు కూడా చైనాపైన ఇదే ఆరోపణలు చేస్తున్నప్పటికీ అమెరికా అంత దూకుడుగా వ్యవహరించడం లేదు. చైనా కరెన్సీ యువాన్ విలువను తక్కువ విలువ వద్ద ఉంచడం వలన చైనా సరుకుల ధరలు తక్కువగా ఉంటున్నాయని దానితో అది…