రాజే: అసెంబ్లీ క్లీన్ చిట్ అక్కరకు వచ్చేనా! -కార్టూన్

  ఐ.పి.ఎల్ మాజీ బాస్, బి.సి.సి.ఐ మాజీ ఉపాధ్యక్షుడు, పారిపోయిన నేరస్ధుడు అయిన లలిత్ మోడి వ్యవహారం రాజస్ధాన్ ముఖ్యమంత్రిని వదిలేట్లు లేదు. రాజస్ధాన్ అసెంబ్లీ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చినా లలిత్ మోడీ వ్యవహారం సదరు క్లీన్ చిట్ ను వెక్కిరిస్తూనే ఉంది. లలిత్ మోడీపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు, ఐ.పి.సి కేసు దాఖలు కావడంతో ఆయన లండన్ పారిపోయాడు. వలస వచ్చిన పక్షిగా అక్కడే సెటిల్ కావాలని నిర్ణయించుకుని అందుకు దశాబ్దాల నాటి…

లలిత్ గేట్: మోడి అవినీతి పాలనకు సాక్ష్యం -1

నరేంద్ర మోడి నీతిమంతమైన పాలనలో మొదటి ‘గేట్’ తెరుచుకుంది. ‘నా యేడాది పాలనలో ఒక్క కుంభకోణం అయినా జరిగిందా? నాయకుల పిల్లలు, అల్లుళ్ళకు అయాచిత లబ్ది ఒనగూరిందా? గత యేడాదిలో ప్రజలకు మంచి రోజులు వస్తే దేశాన్ని దోచుకునేవారికి చెడ్డ రోజులు వచ్చాయి” అని తమ ప్రభుత్వ వార్షిక దినాన మోడి ప్రకటించిన కొద్ది రోజులకే ‘లలిత్ గేట్’ బట్టబయలయింది. నరేంద్ర మోడి ఎడతెగకుండా చేస్తున్న ‘నీతిమంతమైన పాలన’ చప్పుళ్లను అపహాస్యం చేస్తూ లలిత్ మోడి పాస్…

క్రికెట్: బడా బాబుల కేకు పంపకం -కార్టూన్

  ఐదు రోజుల టెస్ట్ క్రికెట్ నుండి ఒక్క పూటలో ముగిసిపోయే టి20 మ్యాచ్ ల వరకు క్రికెట్ ఆట ప్రయాణించింది. ఈ ప్రయాణంలో ఆట గమ్యం ఏమిటన్నది చూస్తే జనుల మానసికోల్లాసం కాకుండా డబ్బు సంపాదనే అని స్పష్టం అవుతుంది. ఏ ఆట అయినా మనిషి యొక్క శారీరక, మానసిక, మేధో శక్తులను మెరుగుపరచడానికి, దైనందిన జీవనం నుండి కాసింత బైటపడి సేద తీరడానికీ, ఆరోగ్యం పెంపొందించడానికి పుట్టినదే. కానీ సమాజం డబ్బు జబ్బుతో బాధపడడం…

బి.జె.పి అధ్యక్షుడిని ముంచేస్తున్న జశ్వంత్ వలపోత -కార్టూన్

మధ్య ప్రదేశ్ బి.జె.పి నేత, ఎల్.కె.అద్వానీ శిష్యుడు, ఎన్.డి.ఏ ప్రభుత్వంలో విదేశీ మంత్రి అయిన జశ్వంత్ సింగ్ కి టికెట్ దక్కలేదు. తన సొంత నియోజకవర్గం అయిన బార్మర్ లో పోటీ చేస్తానని సంవత్సరన్నర క్రితమే అద్వానీకి జశ్వంత్ మొర పెట్టుకున్నారట. కానీ ఆయన మొర కాస్తా రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్లే అయింది. గాంధీ నగర్ నుండి భోపాల్ కి బదిలీ అవుతానన్న అద్వానీ మొరని ఆలకించేవారే బి.జె.పి లో లేరు. ఇక ఆయన శిష్య…