రంగుల హేళి, హోలీ -ఫోటోలు

చైనాలో వసంత కాలం ఆరంభాన్ని కొత్త సంవత్సర వేడుకలతో జరుపుకుంటే భారత దేశంలో హోలీ వేడుకలతో జరుపుకుంటారు. ప్రకృతి రీత్యా సరికొత్త పచ్చదనాన్ని ఆహ్వానించడానికి ఈ పండుగలు జన్మించి ఆ తర్వాత మతం రంగు పులుముకున్నాయేమో తెలియదు గానీ చైనా కొత్త సంవత్సరం, భారతీయ హోలీ రెండూ ప్రకృతితో ముడిపడి ఉన్న పండగలన్న భావన కలుగుతోంది. వసంత ఋతువు ప్రకృతికి కొత్త అందాల్ని తెస్తుంది. ఆది నుండి ప్రకృతితోనే తన జీవనాన్ని ముడివేసుకున్న మనిషి ఆ ప్రకృతిలో…