ఇంత రాక్షసత్వమా? -వసంత్ కుంజ్ కేసులో కోర్టు

ఢిల్లీ పోష్ లోకాలిటీ ‘వసంత్ కుంజ్’ లో ఒక మైనర్ బాలిక ను పనిలో పెట్టుకుని హింసించిన కేసులో నిందితురాలికి కోర్టు బెయిలు నిరాకరించింది. నోయిడాలో ఒక పేరు పొందిన బహుళజాతి సంస్ధలో కమ్యూనికేషన్ విభాగాని అధిపతిగా పని చేస్తున్న వందన ధీర్ కు బెయిల్ నిరాకరిస్తూ ఢిల్లీ కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 18 సంవత్సరాల జార్ఖండ్ బాలిక ఆర్తనాదాలు విని పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక స్వచ్ఛంద సంస్ధ, పోలీసుల సాయంతో బాలిక…

పనిపిల్లను పెంపుడు కుక్కలతో కరిపించిన దుర్మార్గం!

జీవజాలంలో అత్యంత అభివృద్ధి చెందిన జాతి మనిషి. కానీ మనుషుల్లో ‘మనిషితనం’ చిక్కనవడానికి బదులు జంతు ప్రవృత్తి పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీలో వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తే మనిషి ‘నిజంగా నాగరీకుడేనా’ అన్న అనుమానం కలక్క మానదు. పని చేయించుకోడానికని ఇంటిలో ఉంచుకున్న మైనర్ బాలికను పెంపుడు కుక్కలతో ఒళ్ళంతా కరిపించిన దుర్మార్గులని ఏమనాలి? వారిని జంతువులతో కూడా పోల్చడానికి మనసొప్పడం లేదు. జంతువు, జంతువు కాబట్టి జంతువులానే ప్రవర్తిస్తుంది. కానీ మనిషిలా ప్రవర్తించలేని మనుషుల్ని జంతువుతో…