చెన్నైపై లంగరు వేసిన అల్ప పీడనం -కార్టూన్

నవంబర్ 8 తేదీ నుండి కురుస్తున్న వర్షాలు చెన్నై నగరాన్ని ముంచివేసి నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వరుస పెట్టి దాడి చేసిన రెండు అల్ప పీడనాలు ఈ వర్షాలకు కారణం. అల్ప పీడనాలు కొత్తేమీ కాదు. అల్ప పీడనాలు ఏర్పడితేనే వర్షాలు కురుస్తాయి. కానీ ఈ తరహాలో ఊహించని రీతిలో వర్షపాతం ఇచ్చే అల్ప పీడనాలే కొత్త. ఎల్-నినో పుణ్యమా అని ఈ యేడు నైరుతి ఋతుపవనాలు పెద్దగా వర్షాలను ఇవ్వలేదు. దేశం మొత్తం మీద…

ఋతుపవనాలు: ఈ యేడూ కష్టమే

ఎల్-నినో పుణ్యమాని ఈ సంవత్సరం దేశంలో వర్షపాతం సగటు కంటే చాలా తక్కువ ఉండవచ్చని భారత వాతావరణ విభాగం (ఇండియన్ మీటియొరలాజికల్ డిపార్ట్ మెంట్ -ఐ.ఎం.డి) తాజా అంచనాలో తెలియజేసింది.  93 శాతం వర్షపాతం మాత్రమే కురుస్తుందని ఏప్రిల్ నెలలో ఐ.ఎం.డి అంచనా వేసింది. అంత కూడా ఉండదని జూన్ 2 తేదీన వేసిన అంచనాలో తెలిపింది. సగటులో 88 శాతం కురిస్తే గొప్ప అని ప్రకటించింది. తాజా అంచనాలో 88 శాతం వర్షపాతం ఉండవచ్చని తెలిపిన…

దేశంలో కరువు పరిస్ధితులు, పట్టని ప్రభుత్వాలు

వాతావరణ మార్పులు వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు స్వామినాధన్ హెచ్చరించాడు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్ధితులు ఏర్పడనున్నట్లు ఇప్పటికే సూచనలు అందుతున్నాయనీ, కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనీ విమర్శించారు.  కొద్ది ప్రాంతాల్లో అధిక వర్షాలు, మరి కొన్ని చోట్ల ఎన్నడూ లేనంతగా కరువు ఏర్పడుతుందనీ తెలిపాడు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ‘పోస్ట్ మార్టం’ చర్యలకే అలవాటుపడ్డ ప్రభుత్వాలు ధోరణి మార్చుకోవాలని కోరారు. “వ్యవసాయం పై వాతావరణ మార్పుల…

ఈసారీ సకాలంలోనే ఋతుపవనాలు -ఐ.ఎం.డి

ఈ సంవత్సరం కూడా సకాలంలోనే జూన్ 1, 2012 తేదీనే ఋతుపవనాలు దేశంలో ప్రవేశించనున్నాయని ‘ఇండియన్ మీటియోరోలాజికల్ డిపార్ట్ మెంట్’ మంగళవారం ప్రకటించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఋతుపవనాలు ప్రవేశించడం దాదాపు ఖాయమయిందనీ తెలిపింది. ప్రతి యేటా మే 20 న దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించే నైరుతి ఋతుపవనాలు అనంతరం జూన్ 1 తేదీన కేరళ తీరాన్ని తాకడం ద్వారా దేశంలోని ప్రధాన భూభాగంలోకి ప్రవేశిస్తాయి. రైతులు వ్యవసాయం కోసం ప్రధానంగా వర్షాలపై ఆధారపడే భారత…