చెప్పులు, కుర్చీలూ… అప్పుడప్పుడూ పూలు! -కార్టూన్

ఓపిక ఉండాలే గానీ ఎన్నికల చిత్రాలు ఎన్నయినా చెప్పుకోవచ్చు. ప్రత్యర్ధి రాజకీయ పార్టీలపైనా, అభ్యర్ధుల పైనా నానా కూతలూ కూసుకునే ఎన్నికల కాలంలో భరించలేని శబ్ద కాలుష్యం జనాన్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. ఒక్క శబ్ద కాలుష్యం ఏం ఖర్మ, పత్రికల నిండా సాహితీ కాలుష్యం కూడా దుర్గంధం వెదజల్లుతూ ఉంటుంది. ఒకరి లోపాలు మరొకరు ఎత్తి చూపుకుంటూ గాలిని నింపే దూషణలతో పాటు అప్పుడప్పుడూ -మారుతున్న కాలాన్నీ, మారని అవసరాలను బట్టి- ప్రత్యర్ధులపై ప్రశంసల పూల…

పూర్ వరుణ్, ఏమన్నా తంటాయే! -కార్టూన్

అప్పుడు: ప్రత్యర్ధులకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగం చేస్తేనేమో ఎలక్షన్ కమిషన్ కు నచ్చదాయే…. ఇప్పుడు: మంచి పని చేసినందుకు ప్రత్యర్ధులను ప్రశంసిస్తేనేమో, అది పార్టీకి నచ్చదాయే… (ఎలా చచ్చేది!!!) *** బి.జె.పిలో ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించిన వరుణ్ గాంధీ ప్రస్తుతం తమ పార్టీవారి నుండే విమర్శలు ఎదుర్కొంటున్నారు. సోదరుడు రాహుల్ గాంధీని పొగిడినందుకు స్వపార్టీ నేతల ఖండన మండనలకు తోడు తన తల్లి మేనకా గాంధీ నుండి మందలింపు సైతం ఎదుర్కొన్నారాయన. మంగళవారం అమేధి…