WW II: డ్రెస్డెన్ పై బ్రిటన్-అమెరికా పైశాచిక బాంబింగ్ కి 70 యేళ్ళు

  రెండవ ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో అమెరికా, బ్రిటన్ లు సాగించిన మారణహోమం అంతా ఇంతా కాదు. వరల్డ్ వార్ II అనగానే యూదులపై నాజీల దుష్కృత్యాలు, హిట్లర్ ఫాసిజం గుర్తుకు వస్తాయి. అలా గుర్తుకు వచ్చేలా చరిత్ర రచన జరిగింది. కానీ జర్మనీ, ఇటలీ ల్లోని ఫాసిస్టు నియంతృత్వాలను సాకుగా చూపిస్తూ ఆ దేశాలు ఓడిపోతూ వెనక్కి పారిపోతున్న కాలంలో అమెరికా, బ్రిటన్ లు తెగబడి అనేక మారణహోమాలు సృష్టించాయి. హీరోషిమా, నాగసాకి నగరాలపై…

నాజీ హత్యాక్షేత్రం ‘ఆష్విజ్’ విముక్తికి 70 యేళ్ళు -ఫోటోలు

జనవరి 26 తేదీ మనకి రిపబ్లిక్ దినంగా తెలుసు. ఆ తేదీకి ప్రపంచం గుర్తుంచుకునే ప్రాముఖ్యత కూడా మరొకటి ఉన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. నాజీ సైన్యం దెబ్బకి మహా ఘనత వహించిన ఐరోపా రాజ్యాలన్నీ తోకముడిచి పారిపోవడమో, చేతులెత్తి లొంగిపోవడమో చేస్తున్న దశలో ఆ హంతక సైన్యానికి ఎదురొడ్డి పోరాడి నిలిచిన ఒకే ఒక్క దేశం  సోవియెట్ రష్యా. బోల్శివిక్ సైన్యం ధాటికి నాజీ సైన్యమే కకావికలై పరుగులు తీస్తుంటే వారిని వెన్నంటి…

జేమ్స్ ఫోలి చావు మరో వరల్డ్ వార్ కు దారి తీస్తుందా?

ఇస్లామిక్ స్టేట్/ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవంత్/ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా కు చెందిన మిలిటెంటు ఒకరు అమెరికా విలేఖరి జేమ్స్ ఫోలీ తలను కత్తితో కోసి చంపినట్లు చూపుతున్న వీడియో ఇటీవల ఇంటర్నెట్ లో ప్రత్యక్షం అయింది. ఈ వీడియోను సాకుగా చూపుతూ అమెరికా మళ్ళీ మధ్య ప్రాచ్యంలో మరో యుద్ధానికి నగారా మోగిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ఒబామా, బ్రిటన్ ప్రధాని కామెరాన్ లు యుద్ధ జ్వర పీడితులైనట్లుగా ప్రకటనలు గుప్పిస్తుండగా…