ఆఫ్ఘనిస్ధాన్‌పై పాకిస్ధాన్ రాకెట్ల దాడి, తాలిబాన్‌కి మద్దతుగానేనని కర్జాయ్ ఆరోపణ
గత మూడు వారాలనుండి పాకిస్ధాన్ కనీసం 470 రాకెట్లు ప్రయోగించిందనీ, ఈ దాడిలో 36 మంది పౌరులు మరణించారనీ ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఆరోపించాడు. చనిపోయినవారిలో 12 మంది పిల్లలు కూడా ఉన్నారనీ ఆయన తెలిపాడు. పాకిస్ధాన్ సరిహద్దుల్లో ఉన్న కూనార్, నంగర్హార్ రాష్ట్రాలలో ఈ దాడులు చోటు చేసుకున్నాయని ఆఫ్గన్ సరిహద్దు అధికారులు తెలిపారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. నాటో బలగాలు ఈ రాష్ట్రాలనుండి ఖాళీ చేశాయి. రాకెట్ దాడులతో పౌరులు అక్కడినుండి…