ఆ సుప్రీం జడ్జి పేరు ఎ.కె.గంగూలీ

‘నువ్వు కూడానా బ్రూటస్?’ షేక్ స్పియర్ నాటకంలో రోమన్ డిక్టేటర్ జులియస్ సీజర్ ను కత్తితో పోడిచినవారిలో బ్రూటస్ కూడా ఉండడం చూసి సీజర్ వేసే ప్రశ్న ఇది. ‘జులియస్ సీజర్’ నాటకంలో మూడో సీన్ లో (మార్క్ ఏంటోని ప్రసంగం ‘ఫ్రెండ్స్, రోమాన్స్, కంట్రీమెన్!’ కాకుండా) అత్యంత పేరు పొందిన డైలాగ్ ఇది. తనకు అత్యంత ప్రియమైన స్నేహితుడని భావించిన సెనేటర్ మార్కస్ బ్రూటస్ కూడా తనను హత్య చేస్తున్నవారిలో ఉండడం చూసి సీజర్ ఇలా…

అసరం బాపు అసలు రూపు ఇదీ!

అసరం బాపు గుర్తున్నాడా? గత డిసెంబర్ నెలలో నిర్భయపై అత్యాచారం జరిగిన తర్వాత వెల్లువెత్తుతున్న నిరసనల మధ్య నోరు పారేసుకున్న బాబా!. అత్యాచారంలో నిర్భయ తప్పు కూడా ఉన్నదనీ, తనపై లైంగిక దాడి చేసినవారిని ఆమె ‘అన్నా, తమ్ముడూ’ అని వేడుకుని ఉంటే వారాపనికి దిగి ఉండేవారు కాదనీ, ఆ విధంగా ఆమె గౌరవం (ఆయన ఉద్దేశ్యం శీలం అని) కాపాడబడి ఉండేదనీ కూసిన మహా ‘పురుషుడు’! అంతటితో ఆగాడా? “రెండు చేతులు కలవకుండా శబ్దం రాదు…

అత్యాచార నేరం: రెండు వేళ్ళ పరీక్ష ఆపండి -సుప్రీం

లైంగిక అత్యాచార నిర్ధారణకు రెండు వేళ్ళతో పరీక్ష జరపడం వెంటనే ఆపాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ‘రెండు వేళ్ళ పరీక్ష,’ బాధితుల ‘ఏకాంత హక్కు’ (right to privacy) కు తీవ్ర భంగకరం అని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రకటించింది. లైంగిక అత్యాచార నేర నిర్ధారణ కోసం మరింత సానుకూలమైన, ఆధునిక పరీక్షలను బాధితులకు అందుబాటులో ఉంచాలని ధర్మాసనం కోరింది. పరీక్ష నివేదిక బాధితులకు అనుకూలంగా ఉన్నప్పటికీ అది మరోసారి బాధితురాలిని అత్యాచారం చేయడంతో సమానమని…

ముంబై: బాలికకు మత్తు ఇచ్చారు, ఆపైన….

క్రెడిట్ అంతా ఢిల్లీకే పోతోందనుకుందో ఏమో గాని ఈసారి బాలికపై అత్యాచారానికి ముంబై ముందుకొచ్చింది. ముంబై దారుణం ఏమిటంటే చిన్న పిల్ల మీద నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడడం. ముంబైలోని వకోలా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ పైశాచికం చోటు చేసుకుంది. నిందితులంతా 20-25 సంవత్సరాల మధ్య వయసు వారు. పుట్టిన రోజు పార్టీకని నిందితుల్లో ఒకరి స్నేహితురాలి చేత బాలికను ఇంటికి పిలిపించుకుని మత్తు మందు ఇచ్చి నలుగురు యువకులు లైంగిక అత్యాచారానికి ఒడిగట్టారు.…

బాలికలపై అత్యాచారాలు, కదిలించే కార్టూన్లు

ఏప్రిల్ 15 తేదీన ఇద్దరు యువకులు పీకల్దాకా తాగి కన్నూ మిన్నూ కానని మదాన్ని నిలువెల్లా నింపుకున్నారు. కాపు కాసి, చాక్లెట్ ఆశ చూపి అయిదేళ్ళ పాపను తమ గదిలోకి తీసుకెళ్లారు. అనంతరం అత్యంత పాశవిక రీతిలో అత్యాచారం చేశారు. ఏప్రిల్ 17 తేదీన కూడా ఇలాగే మరో ఐదేళ్ల పాపను చాక్లెట్ ఆశ చూపి పిలిచి అత్యాచారం చేశాడొక మధ్య వయస్కుడు. పనయ్యాక పాపని పొలాల్లో పారేసిపోయాడు. ఆ పాప ఇప్పుడు పూనాలో ఒక ప్రైవేటు…

మధ్యప్రదేశ్ లో మరో పాప!

ఢిల్లీలో ఐదేళ్ల పాపపై జరిగిన అత్యాచారం విషయంలో దేశం నిశ్చేష్టురాలై ఉండగానే మధ్య ప్రదేశ్ లో మరో ఐదేళ్ల పాపపై దాదాపు అలాంటి ఘోరమే చోటు చేసుకుంది. ఐదేళ్ల పాప పైన 35 సంవత్సరాల త్రాష్టుడొకరు లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ పాప కూడా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని పత్రికలు చెబుతున్నాయి. పరిస్ధితి క్షీణించడంతో పాపను హుటాహుటిన నాగపూర్ కి ఎయిర్ అంబులెన్సు లో మహారాష్ట్ర లోని నాగపూర్ కి తరలించారు. మధ్య ప్రదేశ్ లోని…

ఇంకో అత్యాచారం, ఈసారి స్విస్ మహిళ పైన

జర్మనీ మహిళ పైన ఒడిషా మాజీ డి.జి.పి పుత్ర రత్నం ఏడేళ్ల క్రితం అత్యాచారం చేసిన కేసులో నిందితుడి గుర్తింపు గురించి నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, పోలీసులు ఒకవైపు మల్లగుల్లాలు పడుతుండగానే మధ్య ప్రదేశ్ లో ఒక స్విస్ మహిళ పైన అత్యంత దారుణంగా ఎనిమిది మంది భారతీయులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఢిల్లీ బస్సులో మెడికల్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం దరిమిలా భారత కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో ఇప్పటికే మారుమోగుతున్నాయి. స్విస్ బాధితురాలి పైన జరిగిన…