ఉక్రెయిన్ అధ్యక్షుడు కీవ్ నుండి పరారీ?

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ రాజధాని విడిచి పెట్టి పరారీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. రష్యా పార్లమెంటు (డ్యూమా) స్పీకర్ వ్యాచెస్లావ్ వొలోడిన్ ఈ సంగతి వెల్లడి చేశాడు. జెలెన్ స్కీ కీవ్ నుండి వెళ్లిపోయాడని, ఆయన లువోఫ్ నగరంలో ఏర్పాట్లు చేసుకున్నాడని డ్యూమా స్పీకర్ చెప్పాడు. లువోఫ్ (Lvov) నగరం ఉక్రెయిన్ లోనిదే. అయితే అది ఉక్రెయిన్-పోలండ్ సరిహద్దుకు 85 కి.మీ దూరంలో ఉంది. కీవ్ అధ్యక్ష భవనాన్ని కూడా రష్యన్ బలగాలు ఆక్రమించి తనను…