జర్మనీలో చైనా ప్రధాని, చర్చకు రానున్న వాణిజ్య ఉద్రిక్తతలు
మూడు దేశాల పర్యటనను ముగించుకున్న చైనా ప్రధాని లీ కెషాంగ్ తన పర్యటనలో చివరి మజిలీ అయిన జర్మనీ చేరుకున్నారు. ప్రధాని పదవి స్వీకరించిన తర్వాత ఇండియాతో తన మొట్టమొదటి విదేశీ పర్యటనను ప్రారంభించిన లీ అనంతరం పాకిస్తాన్, స్విట్జర్లాండ్ సందర్శించారు. ఆదివారం జర్మనీ చేరుకున్న లీ, జర్మనీ ఛాన్సలర్ తో జరిపే చర్చల్లో ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు చర్చకు రానున్నాయని తెలుస్తోంది. వాణిజ్య వ్యవహారాల్లో పరస్పర ఆరోపణలు చేసుకుని ఒకరిపై మరొకరు…