వేడి సెగల డ్రాగన్ షేక్-హ్యాండ్ -కార్టూన్
చైనా ప్రధాని లీ-కెషాంగ్ భారత్ పర్యటన నేటితో మూడో రోజులోకి ప్రవేశించింది. ఈ రెండు రోజుల్లోనే పలు కీలక ఒప్పందాలు కుదిరాయని ఇరు దేశాల ప్రధాన మంత్రులు సంయుక్త విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. పలు ‘అవగాహనా ఒప్పందాలు’ (Memorandum of Understanding -MoU) కుదిరాయని కూడా వారు తెలిపారు. పర్యటన ప్రారంభంలో ‘తొలుత వాణిజ్య సంబంధాలు బాగా అభివృద్ధి చేసుకుని సరిహద్దు సమస్య దీర్ఘకాలికంగా పరిష్కరించుకుందాం’ అని లీ-కెషాంగ్ చెప్పినట్లు ది హిందు పత్రిక ప్రకటించింది. తీరా…