మాది వైట్ వాష్ కమిటి అనే ప్రభుత్వం అనుకుంది –జస్టిస్ వర్మ కమిటీ సభ్యుడు

[ఢిల్లీ బస్సులో సామూహిక అత్యాచారం దుర్ఘటనపై వెల్లువెత్తిన ప్రజల డిమాండ్స్ కు స్పందించి మహిళా చట్టాలలో మార్పులు తేవడానికి నియమించబడిన జస్టిస్ వర్మ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. 30 రోజుల గడువు కోరి 29 రోజుల్లోనే నివేదిక పూర్తి చేసి ఇచ్చిన కమిటీ దానికి కారణం కూడా చెప్పింది. అనేక సామాజిక కోణాలతో ముడి పడి ఉన్న బాధ్యతను కేవలం ముగ్గురు సభ్యులు తీవ్రంగా శ్రమించి ముప్పై రోజుల్లోనే అధ్యయనం చేసి…