ఇండియాకు తాలిబాన్ నుండి అనూహ్య ప్రశంసలు
భారత పాలకులకు ఆఫ్ఘన్ తాలిబాన్ నుండి అనూహ్య రీతిలో ప్రశంసలు లభించాయి. ఆఫ్ఘనిస్ధాన్ లో మిలట్రీ పరంగా జోక్యం చేసుకోవాలన్న అమెరికా ఒత్తిడిని భారత్ సమర్ధవంతంగా ప్రతిఘటించిందని తాలిబాన్ కొనియాడింది. అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లియోన్ పెనెట్టా ను భారత్ ఒట్టి చేతులతో పంపి మంచిపని చేసిందని ప్రశంసించింది. స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం పరితపిస్తున్న ఆఫ్ఘన్ ప్రజల ఆకాంక్షలకు భారత్ విలువ ఇచ్చిందనీ, అమెరికా ఒత్తిడికి లొంగి ఆఫ్ఘన్ ఆపదలోకి భారత్ ను నెట్టకుండా విచక్షణ చూపారని…