లిబియా యుద్ధం: ఈ కార్యక్రమాన్ని ప్రాయోజితమొనర్చినవారు… … -కార్టూన్
“నిజం చెప్పులు తొడిగే లోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుంద”ని సామెత. రెండో ప్రపంచ యుద్ధంలో గోబేల్స్ సాగించిన దుష్ప్రచారం గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం. ఒక అబద్ధాన్ని పది సార్లు చెప్పి నిజంగా మార్చే కళ గోబెల్స్ రుజువు చేశాడని పాఠాలు తీస్తాం. కాని గోబెల్స్ వద్ద నేర్చుకున్న పాఠాల్ని పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలు, వాటి ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాపితంగా విస్తరించి ఉన్న కార్పొరేట్ పత్రికలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే గోబెల్స్‌కే పాఠాలు నేర్పేవిధంగా తయారయ్యారు.…