నాటో దాడులకు వ్యతిరేకంగా లిబియా ప్రజల అతి పెద్ద ప్రదర్శన -వీడియో

లిబియా ప్రజలు గడ్డాఫీని తిరస్కరిస్తున్నారనీ, గడ్డాఫి పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారనీ గడ్దాఫీ ప్రభుత్వ బలగాలు లిబియా ప్రజలను చంపుతుంటే వారిని కాపాడ్డానికే తాము లిబియాపై బాంబులు మిసైళ్ళతో దాడులు చేస్తున్నామనీ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు ఊదరగొడుతున్న సంగతి తెలిసిందే. కాని నాటో దాడుల ఫలితంగా గడ్డాఫీని వ్యతిరేకిస్తున్న వారు సైతం తమ వ్యతిరేకతను పక్కన పెట్టి విదేశీ మూకల దాడులను దృఢంగా వ్యతిరేకిస్తున్నారు. జులై 1 జరిగిన లిబియా ప్రజలు పాల్గొన్న అతి పెద్ద…

లిబియా ప్రజలకు ‘నాటో’ ప్రసాదించిన ప్రజాస్వామ్యం -కార్టూన్

గడ్డాఫీని కూలదోసి లిబియా ప్రజలకు ప్రజాస్వామ్యం ప్రసాదించడానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు అనే గొప్ప ప్రజాస్వామ్య దేశాలు నడుం బిగించాయి. నాటో యుద్ధ విమానాలు లిబియాపై బాంబుదాడులు చేసి ప్రజలను చంపినా, అది వారిని కాపాడడానికే. గడ్డాఫీ బతికున్నంతవరకూ లిబియాను ఆయననుండి కాపాడ్డానికీ, లిబియా ప్రజలకు ప్రజాస్వామ్యం ప్రసాదించడానికి బాంబుదాడులు చేస్తూ ప్రజలు చంపుతూనే ఉంటాయట! కాని అది ప్రజలను గడ్డాఫీనుండి కాపాడ్డానికేనంటే నమ్మాలి మరి, తప్పదు! ఎందుకంటే చెప్తున్నది అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు గనక. అమెరికా,…

లిబియాపై నాటో బాంబు దాడిలో ఓ కుటుంబంతో సహా ఐదుగురు పౌరుల మరణం

గడ్డాఫీ బలగాల కాల్పులనుండి లిబియా పౌరులను రక్షించండంటూ భద్రతా సమితి నాటో దళాలకు అనుమతినిచ్చింది. పౌరులను కాపాడ్డానికి “అన్ని చర్యలూ తీసుకోండి” అని తమకు అనుమతి దొరికిందే తడవుగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సుల యుద్ధ విమానాలు లిబియా అంతటా బాంబుదాడులు మొదలు పెట్టాయి. వీరి దాడుల్లో లిబియా అంతటా పట్టణాలు, గ్రామాలు స్మశానాల్లా మారిపోయాయి. గడ్డాఫీ ఇంటిపై దాడి చేసి అతని మనవళ్ళను ముగ్గురినీ, చివరి కొడుకునీ చంపిన నాటో బలగాలు తాజాగా ట్రిపోలిలోని సౌక్ ఆల్-జుమా…