బాబా రాందేవ్ మందు తింటే మగ పుట్టుక గ్యారంటీ(ట)!

భారత సామాజిక వ్యవస్ధ ప్రయాణం పైకి ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వాస్తవంలో మధ్య యుగాల చెంతకు ప్రయాణిస్తోందని చెప్పేందుకు మరో దృష్టాంతం ఇది! పురోగమనం, ప్రగతి, అభివృద్ధి, ముందడుగు… ఇలాంటి పదాలు తమ అర్ధాన్ని కోల్పోవడమే కాదు, విచిత్రార్ధాల్ని సృష్టిస్తున్న కాని కాలంలో ఉన్నామని బాబా రాందేవ్ గారి దివ్య ఔషధ వ్యవస్ధ స్పష్టం చేస్తోంది. బాబా రాందేవ్ నెలకొల్పిన ఆయుర్వేద ఔషధ కంపెనీ ‘పతంజలి ఆయుర్వేద కేంద్ర ప్రైవేట్ లిమిటెడ్’ ఒక ఔషధం తయారు చేసింది.…

వేయి తలల హైందవ విషనాగుడి మరో వికృత శిరస్సు, ‘అస్పృశ్య గర్భం’

‘కుల వివక్ష’, వేయ పడగల హైందవ విషనాగు వికృత పుత్రిక అన్న నిజానికి సాక్ష్యాల అక్షయ పాత్రలు బోలెడు. ఎంతమంది ఎక్కినా పుష్పక విమానంలో మరొకరికి చోటు ఉంటుందో లేదో గానీ కులాల కాల కూట విషమే రక్తనాడుల్లో ప్రవహించే హైందవ విష నాగు కాట్లకు బలైన సాక్ష్యాలకు అంతూ పొంతూ లేదు. అండం తమదే, అండ విచ్ఛిత్తి చేసే వీర్యకణమూ తమదే… అయినా అండ వీర్య కణాల సంయోగ ఫలితమైన పునరుత్పత్తి కణాన్ని మోసే అద్దె…

ఆడపిండం హత్యలు విద్యాధిక కుటుంబాలలోనే ఎక్కువ -సర్వే

ఆడపిల్లలను పిండ దశలోనే హత్య చేయడం నిరక్ష్యరాస్య కుటుంబాల కంటే విద్యాధిక కుటుంబాలలోనూ, ధనికుల కుటుంబాలలోనూ అధికంగా జరుగుతున్నాయని భారత దేశంలో జరిగిన ఓ సర్వేలో తేలింది. విద్యాధిక, ధనిక కుటుంబాలు మొదటి బిడ్డ ఆడపిల్ల పుట్టాక రెండవ బిడ్డ ఆడపిల్లే పుట్టబోతున్నదని తెలిస్తే అబార్షన్ చేయించుకుంటున్నారని ఈ సర్వేలో తేలింది. ఇలా రెండో ఆడపిల్లలను పిండ దశలోనే చంపివేయడం విద్యాధికులు, ధనికుల కుటుంబాలలోనే అధికంగా ఉండడం కలవరపరిచే అంశమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెంటర్…