జపాన్ ను అధిగమించి రెండో స్ధానానికి చేరిన చైనా అర్ధిక వ్యవస్ధ

చైనా ఇప్పుడు ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధ. రెండవ స్ధానంలో ఉన్న జపాన్ దేశాన్ని వెనక్కి నెట్టి చైనా రెండో స్ధానం లోకి అడుగు పెట్టింది. వాస్తవానికి 2010 సెప్టెంబరు నాటికే చైనా జపాన్ ను అధిగమించింది. వార్తా సంస్ధలు ఎందుకనో అప్పట్లో పట్టించుకోలేదు. 2010 డిసెంబరుతో చైనా ఆర్ధిక సంవత్సరం ముగుస్తుంది. చైనా, అమెరికా, జపాన్ లాంటి దేశాలకు ఆర్ధిక సంవత్సరం క్యాలెండర్ సంవత్సరంతో సమానంగా ఉంటుంది. ఆర్ధిక సంవత్సరం ముగిసాక చైనా…