ఆరోసారి ముఖ్యమంత్రి పీఠంపై అవకాశవాద నితీష్

జనతాదళ్ (యునైటెడ్) పార్టీ నేత నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆరవ సారి పదవీ స్వీకార ప్రమాణం చేశాడు. రాజకీయ నీతికి అసలు సిసలు చిరునామాగా చెప్పుకునే ఈ పెద్ద మనిషి తాను “ఛీ, ఫో” అని తిట్టిపోసిన మోడి నేతృత్వ బి‌జే‌పితోనే మళ్ళీ జట్టు కట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టాడు. పక్కా పదవీ వ్యామోహాన్ని బాధ్యత నిర్వహణగా చెప్పుకుంటూ, పచ్చి రాజకీయ అవినీతికి నీతి రంగు పులుముతూ రాజకీయ భ్రష్టత్వంలో తాను ఎంత మాత్రం…

ఢిల్లీ ఆటో ఎక్స్ పో -కార్టూన్

ప్రస్తుతం జరుగుతున్న వివిధ అధికారిక, అనధికారిక కార్యక్రమాలను రాజకీయ పార్టీల కార్యకలాపాలతో, పార్టీల నాయకుల ధోరణులతోనూ, వారి ప్రకటనల తోనూ పోల్చి సున్నితమైన రాజకీయ వ్యంగ్యం పండించడం కార్టూనిస్టులకు ఇష్టమైన ప్రక్రియ.  ఈ ప్రక్రియ ద్వారా ఆయా నాయకుల, పార్టీల వ్యవహార శైలి గురించి తేలికగా అర్ధం చేసుకునే అవకాశం పాఠకులకు, లభిస్తుంది. ఒక్క చూపులో బోలెడు అర్ధాన్ని ఈ కార్టూన్ ల ద్వారా గ్రహించవచ్చు. ఢిల్లీలో నొయిడాలో ఆటో ఎక్స్ పో – 2016 ప్రదర్శన…

నితీష్ కొత్త విశ్వాసం ఎక్కడిది? -కార్టూన్

మోడి దెబ్బతో: “నేను ఓటర్ల విశ్వాసం కోల్పోయాను. రాజీనామా చేసేస్తున్నాను” లాలూ తోడు రాగా: “నాకు మళ్ళీ ఓటర్ల విశ్వాసం వచ్చేసింది” ********* లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో ఎలాంటి ప్రభావమూ చూపించలేకపోయిన ఆనాటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ “తాను ఓటరు విశ్వాసం కోల్పోయినందుకు రాజీనామా చేస్తున్నాను” అని ప్రకటించి గద్దె దిగిపోయారు. ఇప్పుడేమో తనకు 130 మంది ఎం.ఎల్.ఏ ల విశ్వాసం ఉన్నది గనుక తనకు మళ్ళీ సి.ఎం కుర్చీ ఇచ్చేయ్యాలని పాట్నా నుండి…

లాలూ కాంగ్రెస్ సీట్ల తూకం -కార్టూన్

బీహార్ లో కొనసాగుతున్న రాజకీయాలు భారత దేశంలోని మురికి రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం. బి.జె.పి మతతత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పే రామ్ విలాస్ పాశ్వాన్ మరోసారి ఆ పార్టీతోనే సీట్ల సర్దుబాటుకు సిద్ధపడగా ఘన చరిత్ర కలిగిన జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ కాసిన్ని సీట్ల కోసం అవినీతికి శిక్ష పడిన లాలూతో బేరాలు సాగిస్తోంది. లాలూ-కాంగ్రెస్ కూటమితో జత కలుస్తాడని భావించిన పాశ్వాన్ తగినన్ని సీట్లు దక్కకపోవడంతో ‘మతతత్వ’ కార్డు పక్కకు విసిరేసి ఎక్కువ సీట్లు…

గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలు తాగి మనిషి… -కార్టూన్

– ఏమైందీ, తొక్కిసలాటా? కాదు – చట్టం తనపని తాను చేసుకుపోయింది లేండి! – పాలక పక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అంతా కట్ట గట్టుకుని 17 యేళ్ళ నాడు మేసిన గడ్డి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ సౌధాన్ని కూల్చేసే పెను భూతమై నిలిచింది. నితీశ్ కుమార్ (జెడి-యు), బి.జె.పి ల విడాకుల నుండి లబ్ది పొందాలని భావించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆశలు ప్రత్యేక సి.బి.ఐ కోర్టు తీర్పుతో ఒక్కసారిగా అవిరయ్యాయి. కోర్టు…