లాడెన్ ఆచూకి తెలిపిన పాక్ డాక్టర్ పై దేశ ద్రోహం కేసు నమోదు
ఒసామా బిన్ లాడెన్ హత్యకు దారి తీసేలా సి.ఐ.ఏ కి సమాచారం అందించిన పాకిస్ధాన్ డాక్టర్ పైన పాక్ ప్రభుత్వం దేశద్రోహం కేసు నమోదు చేయడానికి నిర్ణయించింది. ఒసామా బిన్ లాడెన్ హత్యపై దర్యాప్తు జరుపుతున్న పాకిస్ధాన్ పానెల్ డాక్టర్ పై విద్రోహం కేసు నమోదు చెయాల్సిందిగా సలహా ఇచ్చింది. బూటకపు టీకా కార్యక్రమాన్ని రూపొందించి లాడెన్ ఆశ్రయం తీసుకుంటున్నాడని చెబుతున్న ఇంటిలో నివసిస్తున్నవారినుండి లాడెన్ కుటుంబ డి.ఎన్.ఎ సంపాదించాడని డాక్టర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. డాక్టర్ షకీల్…