ఉగ్రవాదాన్ని పాక్ బాగా అణచివేస్తోంది -అమెరికా

భారత పాలకులకు అమెరికా నుండి ఊహించని విధంగా (లేక ఊహించిందేనా?) చేదు అనుభవం ఎదురైంది. తమ దేశంలో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ను ఒంటరిని చేసి సాధించాలని మన పాలకులు డిమాండ్ చేస్తుండగా అమెరికా మాత్రం పాకిస్ధాన్ ని “భేష్, ఉగ్రవాదాన్ని బాగా అణచివేస్తున్నావు” అని సర్టిఫికేట్ ఇచ్చింది. లష్కర్-ఏ-తొయిబా (LeT), జైష్-ఏ-మహమ్మద్ (JeM) లను ఉగ్రవాద సంస్ధలుగా అమెరికా పరిగణిస్తుంది. కానీ ఈ సంస్ధల నేతలు గత యేడు భారీ ర్యాలీలు నిర్వహించినప్పటికీ వాటిని…

పాక్ కోర్టులో లష్కర్-ఎ-తయిబా చీఫ్ హఫీజ్ పిటిషన్

అమెరికా ఒత్తిడికి లొంగి పాకిస్ధాన్ ప్రభుత్వం తనపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నదనీ, ఆ ప్రయత్నాలను నిరోధించాలనీ కోరుతూ లష్కర్-ఎ-తయిబా (ఎల్.ఇ.టి) అధిపతి హఫీజ్ సయీద్ పాకిస్ధాన్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన జీవితానికి భద్రత లేదనీ, రక్షణ కల్పించాలనీ, ఏ క్షణంలోనైనా తనకు ప్రాణహాని జరగవచ్చనీ ఆయన పిటిషన్ లో కోరాడు. హాఫీజ్ పిటిషన్ మేరకు లాహోర్ హై కోర్టు పాక్ కేంద్ర ప్రభుత్వానికీ హోమ్ మంత్రికీ, పణ్జాబ్ హోమ్ మంత్రికి నోటీసులు జారీ…

పాకిస్తాన్ ప్రభుత్వం, ఐ.ఎస్.ఐ ల ఆదేశంతోనే ముంబై దాడులు -అమెరికా కోర్టులో హేడ్లీ, రాణాలు – 2

తన “మెమొరాండం ఒపీనియన్ అండ్ ఆర్డర్” లో కోర్టు రాణా డిఫెన్స్ వాదనను ప్రస్తావించింది. “పబ్లిక్ అధారిటీ డిఫెన్స్” కింద తనను తాను డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా రాణా హేడ్లీ సాక్ష్యాన్ని మద్దతుగా ప్రస్తావిస్తున్నాడని కోర్టు పేర్కొంది. అంటే పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధికి ఉండే మినహాయింపులను రాణా కోరుతున్నాడు. హేడ్లీ తన సాక్ష్యంలో ఏమేమీ ప్రస్తావించిందీ రాణాకు చెప్పినట్లు తెలపడంతో రాణాకు హేడ్లీ సాక్ష్యాన్ని డివెన్సు గా వినియోగించాడు. కోర్టు ప్రొసీడింగ్స్ వలన పాకిస్తాన్ కి…