రాజే: అసెంబ్లీ క్లీన్ చిట్ అక్కరకు వచ్చేనా! -కార్టూన్
ఐ.పి.ఎల్ మాజీ బాస్, బి.సి.సి.ఐ మాజీ ఉపాధ్యక్షుడు, పారిపోయిన నేరస్ధుడు అయిన లలిత్ మోడి వ్యవహారం రాజస్ధాన్ ముఖ్యమంత్రిని వదిలేట్లు లేదు. రాజస్ధాన్ అసెంబ్లీ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చినా లలిత్ మోడీ వ్యవహారం సదరు క్లీన్ చిట్ ను వెక్కిరిస్తూనే ఉంది. లలిత్ మోడీపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు, ఐ.పి.సి కేసు దాఖలు కావడంతో ఆయన లండన్ పారిపోయాడు. వలస వచ్చిన పక్షిగా అక్కడే సెటిల్ కావాలని నిర్ణయించుకుని అందుకు దశాబ్దాల నాటి…