తెలంగాణ చర్చ: కొన్ని ఆసక్తికర ఘటనలు

‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2014’ పై చర్చ సందర్భంగా పలు ఆసక్తికర ఘటనలకు లోక్ సభ కేంద్రం అయింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టకేలకు సాకారం అయ్యేలా చొరవ చూపినందుకు లేదా సహకరించినందుకు సోనియా గాంధీకి సాష్టాంగ నమస్కారం చేసేది ఒకరయితే తనకూ కొంత క్రెడిట్ ఇవ్వాలని కోరేది మరొకరు. లగడపాటి పెప్పర్ స్ప్రే పుణ్యమాని ఎం.పిలే తమ తమ నాయకులకు కాపలా కాసిన పరిస్ధితి. ఒక పక్క నినాదాల హోరు సాగుతుండగానే మరో పక్క క్లాజుల…

పెప్పర్ స్ప్రే కాదు, నిషేదిత రసాయనం

‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2014’ ను లోక్ సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకోడానికి లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే జల్లారని అందరూ భావిస్తున్నారు. పత్రికలు కూడా అదే చెప్పాయి. లగడపాటి కూడా తాను పెప్పర్ స్ప్రే చల్లానని చెప్పారు. అయితే ఆయన జల్లింది పెప్పర్ స్ప్రే కాదని మరింత ప్రమాదకరమైన నిషేధిత రసాయనం అని తెలుస్తోంది. లగడపాటి తెచ్చిన కేనిస్టర్ లో ఉన్నది యుద్ధాల్లో సైతం నిషేధించిన కేప్సాయ్సిన్ అని ది హిందు తెలిపింది. కాప్సికమ్ మొక్కల…

లగడపాటిపై దాడి జరగలేదు -ఐ.బి.ఎన్ విలేఖరి (వీడియో)

ఆత్మరక్షణ కోసమే పెప్పర్ స్ప్రే జల్లానని విజయవాడ ఎం.పి లగడపాటి రాజగోపాల్ చెప్పడం అబద్ధం అని సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ విలేఖరి ఈ వీడియోలో చెబుతున్నారు. తాను ప్రెస్ గ్యాలరీలో ఉన్నానని సభలో మాత్రం లగడపాటిపై ఎవరూ దాడి చేయలేదని విలేఖరి చెప్పారు. మొత్తం వ్యవహారం 5 నిమిషాల్లో ముగిసిపోయిందని, ఈ సమయంలో లగడపాటి తనంతట తానే పెప్పర్ స్ప్రే జల్లారు గాని, ఆత్మరక్షణ చేసుకుని పరిస్ధితులు ఆయన ఎదుర్కోలేదని ఈమె చెబుతున్నారు. (వీడియో అందజేసినవారు: టి.జి.టాకీస్)

పెప్పర్ స్ప్రే: ఆత్మరక్షణ కాదు, ఉద్దేశ్యపూర్వకం! -వీడియో

‘ఆత్మ రక్షణ కోసమే పెప్పర్ స్ప్రే చల్లాను’ అని విజయవాడ ఎం.పి లగడపాటి రాజగోపాల్ తన చర్యను సమర్ధించుకుంటున్నారు. భారత ప్రజాస్వామ్యానికి తీరని కళంకం అనీ, దుర్దినం అనీ, మాయని మచ్చ అనీ, సభ్యుడిని ఎన్నికల నుండి డీబార్ చేయాలని, దేశానికి చెడ్డపేరు తెచ్చారని దాదాపు అందరూ విమర్శిస్తున్నప్పటికీ లగడపాటి పాత్రం తన చర్యను సమర్ధించుకుంటున్నారు. టి.డి.పి ఎం.పి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని కాపాడడానికి పరుగెత్తానని, తమపై గూండాల్లాంటి ఎం.పిలు దాడికి వచ్చారనీ, అందుకే ఆత్మ రక్షణ…

నూతన దిగజారుడుతో వేగడం ఎలా -ది హిందు సంపాదకీయం

(లగడపాటి రాజగోపాల్ లోక్ సభలో పెప్పర్ స్ప్రే జల్లి తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నించడంపై ఈ రోజు -ఫిబ్రవరి 14- ది హిందూ పత్రిక రాసిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) సుదీర్ఘమైన, నిష్ప్రయోజనకరమైన పార్లమెంటరీ గలాటా చరిత్ర కలిగిన దేశానికి కూడా సభ ముందుకు సాగకుండా అడ్డుకోవడం కోసం ఒక సభ్యుడు తన తోటి సభ్యుల పైన పెప్పర్ స్ప్రే జల్లడానికి తెగించడం కంటే మించిన సిగ్గుమాలినతనం, గౌరవ హీనం మరొకటి ఉండబోదు. సభలో…

లోక్ సభలో తెలంగాణ బిల్లు, లగడపాటి పెప్పర్ స్ప్రేతో కల్లోలం

తెలంగాణ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టారు. హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే బిల్లును ప్రవేశపెడుతుండగానే లగడపాటి బరితెగించి పాల్పడిన చర్య తీవ్ర అల్లకల్లోలానికి దారి తీసింది. లోక్ సభ వెల్ లోకి ప్రవేశించిన రాజగోపాల్ జేబులో నుంచి పెప్పర్ స్ప్రే (మిరియాల పొడి కలిపిన ద్రావకం) బైటికి తీసి సభ నలువైపులా జల్లడంతో స్పీకర్ తో సహా పలువురు సభ్యులు అశ్వస్ధతకు గురయ్యారు. రాజగోపాల్ సృష్టించిన గందరగోళం పలువురి ఖండన మండనలతో పాటు 17…

సీమాంధ్ర ఎం.పిల అవిశ్వాస తీర్మానానికి మద్దతు కరువు

సీమాంధ్ర కాంగ్రెస్ ఎం.పిల అవిశ్వాస తీర్మానానికి మద్దతు కరువైనట్లు తెలుస్తోంది. సీమాంధ్ర ప్రాంతాల్లోని ఇతర పార్టీల ఎం.పిల మద్దతు కూడగట్టినప్పటికీ ఇతర పార్టీలు మద్దతు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడప్పుడే ఎన్నికలను ఎదుర్కొనే పరిస్ధితి ఏ పార్టీకి లేకపోవడమే దీనిని ప్రధాన కారణంగా కనిపిస్తోంది. చివరికి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు కూడా అవిశ్వాసం తెలపడానికి నిరాకరించారని ది హిందు పత్రిక తెలిపింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దల పరువు…