అక్రమ డబ్బు, పన్ను ఎగవేతలకు నూతన స్వర్గం అమెరికా! -3

– (2వ భాగం తరువాత………….) అక్రమ డబ్బుకు కొత్త స్వర్గం అమెరికా! 2008 ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం తర్వాతి రోజుల్లో అమెరికా, ఐరోపాలు జి20 ని ప్రధానంగా రంగంలోకి దించాయి. జి20 పేరుతో సంక్షోభం భారాన్ని బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాలపై నెట్టడానికి ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా చైనా వద్ద ఉన్న అపారమైన విదేశీ మారక ద్రవ్య నిల్వలు లక్ష్యంగా పెట్టుకుంది. (ఐతే చైనా ఆ బుట్టలో పడకపోవడం వేరే సంగతి).…

దశాబ్దాల భారతీయ శ్రమ కుప్పపోస్తే, లండన్! -ఫోటోలు

ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రజాస్వామ్య దేశంగా బ్రిటన్ కి పేరు. మొట్ట మొదటి పౌర హక్కుల పత్రం ‘మాగ్న కార్టా’ కు ప్రాణం పోసింది బ్రిటిష్ పెట్టుబడిదారులే. రాచరికం నుండి హక్కుల కోసం పోరాడిన బ్రిటిష్ పెట్టుబడిదారీ వర్గం అనతికాలంలోనే ప్రపంచం లోని అనేక ఖండాంతర దేశాలకు బయలెల్లి అక్కడి ప్రజలకు హక్కులు లేకుండా చేశారు. బ్రిటిష్ వలస పాలకులు భారత దేశం లాంటి సంపన్న వనరులున్న దేశాలను దురాక్రమించి వలసలుగా మార్చుకుని ఒకటిన్నర శతాబ్దాల పాటు అక్కడి…

చందోగ్రఫి: లండన్ లో తెలుగుదనం -ఫోటోలు

లండన్, న్యూయార్క్ నగరాల్లో ఓ తెలుగు కుర్రాడు తన కెమెరాలో బంధించిన అద్భుత దృశ్యాలివి. తనను తాను అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ గా పోలేపెద్ది చంద్ర శేఖర్ (ఈ బ్లాగ్ లో వ్యాఖ్య ద్వారా) చెప్పుకున్నారు. కానీ ఆయన తీసిన ఈ ఫోటోలు చూస్తే మాత్రం ఆయన అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ అంటే నమ్మ బుద్ధి అయ్యేలా లేవు. చేయి తిరిగిన (కన్ను తిరిగిన అనాలేమో!) ఫోటోగ్రాఫర్ తీసిన ఫొటోలివి అని చెప్పినా ఇట్టే నమ్మొచ్చు. ఈ ఫొటోల్లో మనుషులు…