‘లండన్ ఒలింపిక్స్ 2012’ స్ట్రీట్ ఆర్ట్ -ఫోటోలు

ప్రఖ్యాత వీధి చిత్రకారుడు బ్యాంక్సీ, లండన్ లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్న సందర్భంగా రెండు వీధి చిత్రాలను తన వెబ్ సైట్ లో ప్రదర్శించాడు. ఈ చిత్రాలు ఏ వీధిలో ఉన్నదీ ఇంకా ఎవరికీ తెలిసినట్లు లేదు. బ్యాంక్సీ కూడా ఆ వివరాలేవీ చెప్పలేదు. (ఆ మాటకొస్తే తన వెబ్ సైట్ లో ఆయన ఉంచిన ఏ చిత్రానికీ వివరాలు లేవు.) వెబ్ సైట్ లో ప్రదర్శించేదాకా ఆ చిత్రాల సంగతి ఎవరికీ తెలిసినట్లు కూడా కనిపించడం…

ఇండియాకి ఒలింపిక్స్ మెడళ్ళు ఎందుకు రావు? -కార్టూన్

ఒలింపిక్స్ సంరంభం ప్రారంభమై ఐదు రోజులు గడిచిపోయాయి పొరుగు దేశం చైనా 13 బంగారు పతకాలతో అగ్ర స్ధానంలో ఉండగా ఇండియా ఇంకా బంగారు ఖాతా తెరవనే లేదు. బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా, షూటర్ గగన్ నారంగ్, బాక్సర్ విజేందర్ సింగ్ ల పై బంగారు ఆశలు ఉన్నా అవి మినుకు మినుకు మంటున్నవే. గగన్ ఇప్పటికైతే ఒక తామ్ర పతకాన్ని మాత్రం అందించాడు. గతంలో హాకీ లో బంగారు పతాకం గ్యారంటీ అన్నట్లు ఉండేది. ఇప్పుడలాంటి…

క్లుప్తంగా…. 30.04.2012

జాతీయం లండన్ ఒలింపిక్స్ ని ఇండియా బహిష్కరించాలి -భోపాల్ బాధితుడు “డౌ కెమికల్స్” కంపెనీ సొమ్ముతో జరుగుతున్న లండన్ ఒలింపిక్స్ ను ఇండియా అధికారికంగా బహిష్కరించాలని భోపాల్ గ్యాస్ లీక్ బాధితుడు సంజయ్ వర్మ డిమాండ్ చేశాడు. గ్యాస్ లీక్ ప్రమాదానికి ఐదు నెలల ముందు జన్మించిన సంజయ్ గ్యాస్ దుర్ఘటన వల్ల అనాధగా మారాడని ‘ది హిందూ’ తెలిపింది. డౌ కంపెనీ చేతులకు భోపాల్ బాధితుల రక్తం అంటిందని, ఆ రక్తం ఇపుడు లండన్ పయనమైందని…

ఒలింపిక్ జ్యోతి రాకమునుపే తగలబడుతున్న లండన్ -కార్టూన్

2012 ఒలింపిక్ ఆటల సంరంభానికి ఇంకా సంవత్సరం మిగిలే ఉంది. ఒలింపిక్ ఆటలు నిర్వహిస్తామని పోటీపడి గెలిచిన లండన్ నగరం అప్పుడే తగలబడిపోతోంది. దశాబ్దాల తరబడి అసమానతకీ, అవమానాలకీ గురైన తొట్టెన్ హామ్, ఇంకా అలాంటి ప్రాంతాల యువత ఉగ్ర రూపం దాల్చి అల్లర్లై లండన్ నగరాన్ని తగలబెడుతోంది. “లూటీలూ, దహనాలతో మీరు సాధించిందేమిటి?” అని అడిగిన విలేఖరులకి “వేలమందిమి శాంతియుత ప్రదర్శనలు చేసినా అస్సలు పట్టించుకోని మీరు మా దగ్గరికి వచ్చి మరీ ఇప్పుడెందుకా ప్రశ్నని…