బీహార్ బకెట్ ఛాలెంజ్: మోడికి అవమానం? -కార్టూన్

ఐస్ బకెట్ ఛాలెంజ్! ఇది గత కొద్ది వారాలుగా ప్రపంచాన్ని ఊపేస్తున్న సవాలు. ఎ.ఎల్.ఎస్ అనే మోటార్ న్యూరాన్ వ్యాధి గురించిన అవగాహన పెంచేందుకు అమెరికాలోని ఏ.ఎల్.ఎస్ అసోసియేషన్ వారు ప్రారంభించిన ఈ సవాలు ప్రపంచ వ్యాపితంగా అనేకమంది సెలబ్రిటీలను రంగంలోకి లాగుతోంది. ఏ.ఎల్.ఎస్ పూర్తి రూపం అమియోట్రోపిక్ లాటరల్ స్కెలేరోసిస్. ఇది ప్రాణాంతక వ్యాధి. లౌ గెహ్రిగ్స్ వ్యాధి అని కూడా దీనిని పిలుస్తారు. ఈ వ్యాధి సోకితే మెదడు, వెన్నుపాముల్లోని మోటార్ న్యూరాన్ కణాలు…