ఆత్మహత్య రైతులు పిరికిపందలు, నేరస్ధులు -బి.జె.పి

భూ సేకరణ చట్టం సవరణల ద్వారా తన రైతు వ్యతిరేక, ప్రైవేటు బహుళజాతి కంపెనీ అనుకూల స్వభావాన్ని చాటుకున్న బి.జె.పి ఇప్పుడు ఏకంగా రైతులపై నేరుగా దాడి చేసేందుకు సైతం వెనుదీయడం లేదు. ఢిల్లీలో ఎఎపి నిర్వహించిన రైతుల ర్యాలీలో ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడడాన్ని ‘నాటకం’గా అభివర్ణించిన హర్యానా వ్యవసాయ మంత్రి, ఆత్మహత్యకు పాల్పడే రైతులు ‘పిరికిపందలు’ అనీ, ‘నేరస్ధులు’ అనీ తిట్టిపోసాడు. “భారత చట్టం ప్రకారం ఆత్మహత్యకు పాల్పడడం నేరం. ఆత్మహత్యకు పాల్పడే ఏ…

16 సంవత్సరాల్లో 2.5 లక్షల రైతుల ఆత్మ హత్యలు

భారత దేశంలో రైతుల ఆత్మ హత్యలు ఒక సార్వజనీన సత్యం. రైతు ఆత్మహత్య చేసుకున్నపుడల్లా వ్యవసాయ ఉత్పత్తి కార్యకలాపాలకు సంబంధించి కాకుండా మరేదైనా కారణాలను ప్రభుత్వాలు వల్లె వేయడం కూడా అంతే సార్వజనీనం. వారికి తమ పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త రావడం ఇష్టం ఉండదు. కనుక రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా చర్యలు తీసుకుంటారనుకుంటే పొరబాటే. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు అని నిరాకరించడానికి వారు ముందు ప్రయత్నిస్తారు. కాదు చేసుకున్నారంటే ఏదో వ్యక్తిగత కారణాలవల్ల…