నా గొయ్యి నువ్వు, నీ గొయ్యి నేను -కార్టూన్

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రుల వ్యవహారం ఇది. ప్రజల్లో ఒకరిని మరొకరు పలుచన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న దాయాది ముఖ్యమంత్రులు ఒకరి గొయ్యి మరొకరు తవ్వుకుంటూ ఇద్దరూ గోతిలో పడిపోతున్నారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా చూస్తే ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల పైనా జాలి చూపాల్సిన పరిస్ధితి కావచ్చు గానీ ప్రజల కోణంలో నుండి చూస్తే ఇరువురి చర్యల వల్ల వారి వారి అసలు రంగు బయటపడుతున్నందుకు ఆనందించాల్సిన సంగతి. శాసన మండలి సభ్యుల ఎన్నికల సందర్భంగా టి.డి.పి…