రేప్ కి ఆడోళ్ళే కారణం అంటున్న ఢిల్లీ పోలీసులు, తెహెల్కా పరిశోధన (పునర్ముద్రణ)

(ఈ ఆర్టికల్ ఏప్రిల్ 7, 2012 తేదీన మొదటిసారి ఈ బ్లాగ్ లో ప్రచురితమయింది. అమానత్ విషాదాంతం సందర్భంగా అత్యాచారాల విషయంలో ఢిల్లీ పోలీసుల దృక్పధం ఎలా ఉన్నదో గుర్తు తెచ్చుకోవడానికి తేదీ మార్చి మళ్ళీ ప్రచురిస్తున్నాను. భారత సమాజాన్నీ, సంస్కృతినీ ఇలాంటి పుచ్చిపోయిన మెదళ్లు శాసిస్తూ, రక్షకులుగా ఉన్నంతవరకూ అత్యాచారాలు ఆగవనీ, దోషులందరికీ తగిన శిక్షలు పడవనీ తేలికగానే అర్ధం అవుతుంది -విశేఖర్) – “ఆవిడే కోరి వెళ్ళింది” “అంతా డబ్బు కోసమే” “ఇదో వ్యాపారం…

యు.పి: ఒకే రోజు నాలుగు రేప్ లు, మూడేళ్ళ పాపతో సహా

ఉత్తర ప్రదేశ్ లో ఒకే రోజు నాలుగు రేప్ కేసులు పోలీసులని చేరాయి. ఒక దళిత బాలిక, మూడేళ్ళ పాప వారిలో ఉన్నారు. రేపిస్టులు తాము చెయ్యదలుచుకున్నది చేసి బాధితులను నిర్మానుష్య ప్రాంతాల్లో వదిలి పెట్టారు. పదేళ్ళ బాలికను అతని మేనమామతో సహా నలుగురు వ్యక్తులు రేప్ చేశారు. సామూహిక మానభంగానికి గురయిన దళిత బాలిక ఫిర్యాదుని స్వీకరించడానికి పోలీసులు నిరాకరించారు. రెండు రోజులు తిప్పుకున్న తర్వాత మాత్రమే ఫిర్యాదు నమోదు చేశారు. ఝాన్సీ లో ఓ…

రేప్ బాధితురాలిని చచ్చిపొమ్మని బెదిరిస్తున్న గ్రామం

పశ్చిమ బెంగాల్ లోని ఓ గిరిజన గ్రామం అది. కామాంధులైన ఐదుగురు చేతిలో సామూహిక మానభంగానికి గురయిన గ్రామ మహిళ ఒకరిని చావనైనా చావాలని లేదా ఊరొదిలైనా పోవాలనీ ఆ గ్రామం హింసిస్తోంది. ఇంటిపై దాడి చేసి తలుపులు పగల గొట్టి, చావబాది గ్రామ పెద్ద విధించిన ‘గ్రామ బహిష్కరణ’ శిక్షను అమలు చేయించడానికి ఆ గ్రామం అంతా ప్రయత్నిస్తోంది. సామూహిక అత్యాచారంతోనే షాక్ లో ఉన్న ఆ మహిళ, గ్రామస్ధుల హింసతో హతాశురాలై సాయం కోసం…