నోట్ల రద్దు: అధమ స్ధాయిలో ఫ్యాక్టరీ, సేవల జీడీపీ

  ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన డీమానిటైజేషన్ వల్ల ప్రజలు నానా కష్టాలు పడుతుండగా భారత జీడీపీ కూడా అదే పరిస్ధితి ఎదుర్కొంటున్నది. ఆర్ధిక నిపుణులు అంచనా వేసిన దానికంటే ఘోరంగా జీడీపీ వృద్ధి రేటు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.  నవంబరు నెలలో భారత సేవల రంగం వృద్ధి చెందటానికి బదులు కుచించుకుపోనున్నదని హఫింగ్టన్ పోస్ట్ నిర్వహించిన సర్వేలో తేలింది. భారత జీడీపీలో అత్యధిక వాటా -60 శాతం వరకు- సేవల రంగానిదే. కనుక మొత్తం జీడీపీ…

రాజన్: గిల్లి జోల పాడుతున్న పాలకులు -విశ్లేషణ

“పొమ్మనలేక పొగబెట్టారు” అని మర్యాదగా చెప్పుకోవటానికి కూడా వీలు లేకుండా బి‌జే‌పి పాలకులు రఘురాం రాజన్ పట్ల వ్యవహరించారు. హద్దు పద్దు ఎరగని నోటికి ఓనర్ అయిన సుబ్రమణ్య స్వామి తనపైన అలుపు లేకుండా మొరగటానికి కారణం ఏమిటో, ఆయన వెనుక ఉన్నది ఎవరో తెలియని అమాయకుడా రాజన్? రెండో విడత నియామకం ద్వారా ఆర్‌బి‌ఐ గవర్నర్ పదవిలో కొనసాగేందుకు తాను సిద్ధంగా లేనని, అకడమిక్ కెరీర్ పైన దృష్టి పెట్టదలుచుకున్నానని ప్రకటించడం ద్వారా ‘అంత అమాయకుడిని…

వ్యూహాత్మక నిష్క్రమణ -ద హిందూ ఎడిట్..

[ఈ రోజు -జూన్ 20- ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ “A strategic exit” కు యధాతధ అనువాదం. -విశేఖర్] ********* సెప్టెంబర్ లో తన పదవీకాలం ముగిసిన తర్వాత రెండో సారి పదవికి రేసులో ఉండబోవటం లేదని ప్రకటించటం ద్వారా ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, అంతకంతకు గుణ విహీనం గా మారుతున్న పరిస్థితుల నుండి మెరుగైన రీతిలో, గౌరవప్రదంగా బైటపడే మార్గాన్ని ఎంచుకున్నారు. కొన్ని నెలలుగా ఆయన కొనసాగింపు పట్ల మోడి ప్రభుత్వంలో కొన్ని…

వడ్డీ రేట్లు: పరిశ్రమ వర్గాల ఏడుపు – కార్టూన్

రెండు రోజుల క్రితం ఆర్.బి.ఐ గవర్నర్ వడ్డీ రేట్లు సమీక్షించారు. ఈ సమీక్షలో ఆయన వడ్డీ రేట్లు తగ్గిస్తారని అందరూ ఆశించారు. అయితే వారి ఆశలను వమ్ము చేస్తూ గవర్నర్ రఘురామ్ రాజన్ వడ్డీ రేట్లు కదల్చకుండా యధాతధంగా ఉంచారు. వడ్డీ రేట్ల వ్యవహారం ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వంల మధ్య ఎప్పుడూ ఘర్షణకు దారి తీసే అవకాశం గల సమస్యగా ఉంటోంది. దీనికి ప్రధాన కారణం వడ్డీ రేట్ల చుట్టూ ఏర్పడి ఉన్న వాతావరణం. వడ్డీ రేటు…

ధనికులకు ఆర్.బి.ఐ పండగ కానుక, వడ్డీ రేటు తగ్గింపు

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ శత పోరును ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ మన్నించారు. ధనికులు, కంపెనీలకు మరిన్ని రుణాలను అందుబాటులోకి తెస్తూ రెపో రేటును 8 శాతం నుండి 7.75 శాతానికి తగ్గించారు. ద్రవ్య విధానం సమీక్షతో సంబంధం లేకుండానే ఆర్.బి.ఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. “లిక్విడిటీ అడ్జస్ట్ మెంట్ ఫెసిలిటీ కింద పాలసీ రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని నిర్ణయించాము. తద్వారా వడ్డీ రేటు 8 నుండి 7.75 శాతానికి…

వడ్డీ రేటు పెంచిన ఆర్.బి.ఐ, ప్రభుత్వం కినుక

ఆర్.బి.ఐ అధినేత మారినా కూడా రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నూతన గవర్నర్ గా రఘురాం రాజన్ నియామకాన్ని చప్పట్లతో ఆహ్వానించిన కార్పొరేట్, పరిశ్రమల వర్గాలు ఆయన వరుస పెట్టి తీసుకుంటున్న చర్యలతో మింగలేక, కక్కలేక గొణుగుడుతో సరిపెట్టుకుంటున్నారు. తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ స్వల్పకాలిక వడ్డీ రేటు (రెపో రేటు) ను మరో 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో ఏమి అనలేక నిశ్శబ్దమే స్పందనగా మిగిలిపోయారు. ప్రధాన…

సి.ఆర్.ఆర్, రెపో, రివర్స్ రెపో రేట్లు అంటే?

ప్రశ్న: రెపో  రేటు, రివర్స్ రెపో రేటు గురించి వివరించగలరా? జవాబు: ఈ ప్రశ్నకు సమాధానం వివిధ సందర్భాల్లో వివరించాను. కానీ అలాంటి సందర్భం మళ్ళీ వస్తే గుర్తు తెచ్చుకోడానికి పాఠకులకు ఇబ్బంది ఉన్నట్లు కనిపిస్తోంది. బహుశా వివరణలో కాకుండా, టపాలోనే ఈ పేర్లు ఉన్నట్లయితే వెతుక్కోడానికి కొంత సులభంగా ఉండవచ్చని మళ్ళీ వివరిస్తున్నాను. గతంలో ఇచ్చిన వివరణను విస్తృతం చేస్తున్నాను. రిజర్వ్ బ్యాంకు నియంత్రణలో ఉండే వడ్డీ రేట్లను దేశంలో ద్రవ్య చలామణిని అదుపులో ఉంచడానికి…

ద్రవ్య సమీక్ష: ధనిక వర్గాలకు కొత్త ఆర్.బి.ఐ గవర్నర్ షాక్

కొత్త ఆర్.బి.ఐ గవర్నర్ గా రఘురాం రాజన్ నియమితుడయినప్పుడు ఆయన చెప్పిన మాటల్ని బట్టి పరిశ్రమల వర్గాలు తెగ ఉబ్బిపోయాయి. ఆర్.బి.ఐ పరపతి విధానం ద్వారా తమ పరపతి ఇక ఆకాశంలో విహరించడమే తరువాయి అన్నట్లుగా ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. తీరా చర్యల విషయానికి వచ్చేసరికి బ్యాంకు వడ్డీ రేటు తగ్గించడానికి బదులు పెంచేసరికి వాళ్ళకు గట్టి షాకే తగిలింది. ఆ షాక్ ఎంత తీవ్రంగా ఉందంటే ద్రవ్య విధాన సమీక్ష ప్రకటించాక భారత స్టాక్ మార్కెట్లు…

ద్రవ్యోల్బణం తగ్గెను, వడ్డీ రేటు తగ్గును… (ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల వివరణ)

రిజర్వ్ బ్యాంకు నిధుల కోసం కాచుకు కూచున్న కంపెనీల కలలు తీరే రోజు వస్తోంది. ఆర్.బి.ఐ వడ్డీ రేటు మరింత తగ్గడానికి, తద్వారా రిజర్వ్ బ్యాంకు నుండి మరిన్ని నిధులు పొందడానికి కంపెనీలు ‘వర్షపు నీటి చుక్క కోసం ఎదురు చూసే చాతక పక్షుల్లా’ చూస్తున్న ఎదురు చూపులు ఫలించే రోజు రానున్నది. కంపెనీల తరపున వడ్డీ రేట్లు తెగ్గోయాలని ఆర్.బి.ఐ వద్ద చెవినిల్లు కట్టి పోరుతున్న ఆర్ధిక మంత్రి పి.చిదంబరం కూడా కాలర్ ఎగరేయబోతున్నారు. కారణం…

ఆర్ధిక వృద్ధికి నష్టమైనా, వడ్డీ రేట్ల పెంపుకే మొగ్గు చూపిన ఆర్.బి.ఐ

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో సారి వడ్డీ రేట్లను పెంచింది. జూన్ 16న చేపట్టిన ద్రవ్య పరపతి విధానం సమీక్షలో ఆర్.బి.ఐ రెపో రేటు (వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే అప్పులపై వసూలు చేసే వడ్డీ రేటు) 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రివర్స్ రెపో రేటు (వాణిజ్య బ్యాంకులు ఆర్.బి.ఐ వద్ద డిపాజిట్ చేసిన డబ్బుపై ఇచ్చే వడ్డీ రేటు) కూడా 0.25 శాతం పెంచింది. వడ్డీ రేట్ల పెంపుదల…