2 వారాల్లో 7800 కోట్లు పరారీ, అమెరికా మూసివేత ఫలితం

విదేశీ పెట్టుబడుల కోసం భారత ప్రభుత్వం పడని పాట్లే లేవు. ఎన్ని పాట్లు పడినా ఫలితాలు మాత్రం సరిగ్గా విరుద్ధంగా వస్తున్నాయి. దానికి కారణాలు భారత ప్రభుత్వం చేతుల్లో లేకపోవడమే అసలు సమస్య. అక్టోబర్ నెలలో ఇప్పటివరకూ, అనగా రెండు వారాల్లో రు. 7,800 కోట్లు లేదా 1.2 బిలియన్ డాలర్లు దేశం నుండి పరారీ అయ్యాయి. ఈ పలాయనం అమెరికా ప్రభుత్వం మూసివేత ఫలితమేనని పి.టి.ఐ తెలిపింది. భారత ఋణ మార్కెట్ నుండే ఈ మొత్తం…

అమెరికా మబ్బులు, ఇండియనోడి ఉబ్బులు

ఆంధ్ర ప్రదేశ్ లో, బహుశా కోస్తా ప్రాంతంలో, ఒక ముతక సామెత ఉంది. ఒక నిమ్న కులం యొక్క ఆర్ధిక వెనుకబాటుతనాన్ని, సామాజిక అణచివేతను పట్టిచ్చే సామెత అది. మరో విధంగా ఆ కులాన్ని న్యూనతపరిచే సామెత కూడాను. గురువారం ఎగిరెగిరి పడిన భారత స్టాక్ మార్కెట్లను గమనిస్తే ఈ సామెత గుర్తుకు రాక మానదు. అమెరికా ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షిస్తూ ఆ దేశ సెంట్రల్ బ్యాంకు ‘ఫెడరల్ రిజర్వ్’ ఛైర్మన్ అయిన బెన్ బెర్నాంక్,…

సిరియాపై క్షిపణి దాడి వార్తలు; రూపాయి, షేర్లు పతనం

సిరియాపై అమెరికా క్షిపణి దాడి చేసిందన్న వార్తలు గుప్పుమన్నాయి. అమెరికా, సిరియాపై రెండు క్షిపణులతో దాడి చేసిందనీ, ఈ దాడి ఫలితంగా సిరియా రాజధాని డమాస్కస్ లో 50 మంది వరకూ చనిపోయారనీ వార్తలు షికారు చేస్తున్నాయి. తెలుగు టి.వి ఛానెళ్లు ఈ వార్తను ఎక్కడినుండి సంపాదించాయో గానీ ఈ రోజు మధ్యాహ్నం నుండి స్క్రోలింగ్ లో చూపాయి. అయితే ఇందులో నిజం లేదని

ఇరాన్ చమురుతో రు.55 వేల కోట్లు ఆదా -మంత్రి

అమెరికా ఒత్తిడితో ఇరాన్ చమురు దిగుమతులను భారీగా తగ్గించుకున్న ఇండియా తద్వారా చమురు బిల్లును భారీగా పెంచుకుంది. ఆ భారాన్ని ప్రజలపై మోపి నష్టాలంటూ జనం ముక్కు పిండి వసూలు చేసింది. ఈ నిజాన్ని చమురు మంత్రి మొయిలీ ద్వారా బైటికి వచ్చింది. రూపాయి విలువ పతనం వల్ల విదేశీ మారక ద్రవ్య (డాలర్) నిల్వలు భారీగా తరిగిపోతున్న నేపధ్యంలో

ఆహార బిల్లును తప్పు పట్టొద్దు -ది హిందు సంపాదకీయం

(రూపాయి పతనానికి కారణంగా ఆహార భద్రతా బిల్లును కొంతమంది మార్కెట్ పరిశీలకులు చెప్పడాన్ని తప్పు పడుతూ ది హిందూ పత్రిక గురువారం, ఆగస్టు 29, 2013 తేదీన ప్రచురించిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. పత్రిక వెలువరించిన అత్యద్భుతమైన సంపాదకీయాల్లో ఇది ఒకటి అనడంలో నాకు ఎట్టి సందేహం లేదు. రూపాయి పతనంకు సంబంధించి మరికొన్ని అంశాలు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. -విశేఖర్) గత కొన్ని నెలల్లో ఇండియా, ఇండోనేషియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, టర్కీ దేశాల…

రూపాయి ఇంకా కిందికి…, సామాన్యుడి చావుకి!

బుధవారం రూపాయి మళ్ళీ కొత్త రికార్డుకు పతనం అయింది. మంగళవారం డాలర్ ఒక్కింటికి 66 రూపాయల మార్కు దాటి రికార్డు సృష్టించిన రూపాయి విలువ బుధవారం 68 రూపాయల మార్కు దాటిపోయింది. ఒక దశలో డాలర్ ఒక్కింటికి రు. 68.75 పై కు పడిపోయింది. కడపటి వార్తల ప్రకారం (మధ్యాహ్నం 1:45) 1 డాలర్ = రు. 68.025 వద్ద రూపాయి విలువ కొట్టుకులాడుతోంది. (బ్లూమ్ బర్గ్ వార్తా సంస్ధ) మంగళవారం ట్రేడింగ్ ముగిసేనాటికి 66.24 వద్ద…

రూపాయి విలాపం, చిదంబరం చిద్విలాసం

ఒక పక్క రూపాయి, పతనంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంటే, మరొక పక్క ఆర్ధిక మంత్రి చిదంబరం చిద్విలాసం కూడా కొనసాగుతోంది. దేశీయంగా ఆర్.బి.ఐ, ప్రభుత్వం తీసుకోవలసిన అన్ని చర్యలూ తీసుకుంటున్నామనీ, కానీ విదేశాల్లో పరిస్ధితుల వలన రూపాయి పతనం అవుతోందని నిన్నటి వరకూ మంత్రి చెబుతూ వచ్చారు. మంగళవారం సరికొత్త స్ధాయికి రూపాయి పతనం అయిన తర్వాత ఆయన కూడా సరికొత్త పల్లవి అందుకున్నారు. విదేశాల పరిస్ధితులే కాకుండా దేశంలోని పరిస్ధితులు కూడా పతనానికి కారణం అని…

పతనం: రూపాయి vis-à-vis ఉపగ్రహం -కార్టూన్

– ఈ లోపు, మరో శాటిలైట్ లంచ్ వెహికల్: – ఒక వార్త: సోమవారం ఏకంగా 148 పైసలు పతనమై డాలర్ తో మారకపు విలువ 63 రూపాయల మార్కు దాటిన రూపాయి విలువ మంగళవారం మరో కొత్త పతన స్ధాయిని నమోదు చేసింది. నిన్న 63.13 రు.ల వద్ద ముగిసిన రూపాయి విలువ ఈ రోజు ట్రేడింగ్ ఎత్తుకోవడంతోనే 63.75 రు.ల వద్ద ఎత్తుకుంది. ట్రేడింగ్ కొనసాగే కొద్దీ అదింకా పతనమై డాలర్ ఒక్కింటికి రు.…

దశాబ్దంలోనే అత్యధికంగా పడిపోయిన రూపాయి

రూపాయి పతనం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు ప్రకటించినా తన దొర్లుడుకు అడ్డే లేదు పొమ్మంటోంది. ‘కొండలు, గుట్టలు, నదీనదాలు, ఎడారులా నా కడ్డంకి?’ అని శ్రీ శ్రీ ని అరువు తెచ్చుకుని మరీ ప్రశ్నిస్తోంది. అధో పాతాళాన్ని దాటలేనా అని సవాలు చేస్తూ దొర్లి పడుతోంది. తమిళ తంబిలు (అదేనండీ చిదంబరం) ఎందరొచ్చినా, హార్వర్డ్ ఉత్పత్తులు (హార్వర్డ్ ప్రోడక్ట్ అని మన మన్మోహనుడికి పశ్చిమ పత్రికలు ఇచ్చి మురిసిపోయే సర్టిఫికేట్ ఇది) ప్రధానులే…

రూపాయి: చేతకాకపోతే సరి! -కార్టూన్

“ఏం భయపడొద్దు. అది మరింత జారిపోకుండా ఎక్కడో ఒకచోట ఆగి తీరాల్సిందే!” – “రూపాయిన పతనం కానివ్వం.”అడిగినప్పుడల్లా ప్రధాని, ఆర్ధిక మంత్రులు చెప్పే మాట ఇది. ఒక పక్క పతనం అవుతూనే ఉంటుంది. వీళ్ళేమో మీడియా సెంటర్లో కూర్చుని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతుంటారు. అదేమని అడిగితే “ఇక్కడ అంతా బాగానే ఉంది. విదేశాల్లో పరిస్ధితుల్ని మనం నియంత్రించలేము కదా?” అని చిలక పలుకులు పలుకుతున్నారు. అసలు విదేశాల్లో పరిస్ధితి బాగోలేకపోతే ఆ ప్రభావం మనమీద ఎందుకు…

భారత స్టాక్ మార్కెట్లలో రక్తపాతం

శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభాన్ని తలపించాయి. అమెరికాలో ఆశావాహ పరిస్ధితులు నెలకొన్నాయని భావించిన అంతర్జాతీయ మదుపరులు భారత స్టాక్ మార్కెట్ల నుండి, రూపాయి నుండి తమ సొమ్ము ఉపసంహరించుకుని డాలర్ల కోసం ఉరుకులు పరుగులు పెట్టడంతో రూపాయి ఢమాల్ మని కూలిపోయింది. రూపాయితో పాటు స్టాక్ సూచీలు కూడా ఒక్కుమ్మడిగా కూలిపోయాయి. మార్కెట్ల పతనాన్ని పత్రికలు రక్తపాతంతో పోల్చుతున్నాయి. ఈ ఒక్కరోజే 2 లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ ను…

ఏదీ రూపాయి, ఎక్కడా కనబడదేం? -కార్టూన్

– రాజకీయ నాయకుడు: “రూపాయి చాలాకనిష్ట స్ధాయిలో ఉంది. ఇప్పుడూ – దాన్ని ఇంకా మెరుగ్గా గవర్న్ చెయ్యొచ్చంటారా?” – రూపాయి బతుకు కనాకష్టంగా మారింది. జింబాబ్వే ప్రభుత్వం లాగా జాతీయ కరెన్సీ రూపాయి రద్దు చేసుకుని అమెరికన్ డాలర్ నే కరెన్సీగా చేసుకునే రోజులు దాపురిస్తాయా అన్నట్లు తయారయింది పరిస్ధితి. ఆర్.బి.ఐ, ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రూపాయి పతనం కొనసా…….గుతూనే ఉంది. జులై 8 తేదీన చరిత్రలోనే అత్యంత కనిష్ట స్ధాయి…

ఇండియన్లూ, ధ్యాంక్స్! -ఒబామా (వ్యంగ్యం)

రూపాయి విలువ దయనీయమైన పరిస్ధితిలో కొట్టుమిట్టాడుతోంది. రూపాయి విలువ తగ్గడం అంటే మన కొనుగోలు శక్తి తగ్గిపోవడం. అనగా మనం సంపాదించే ఆ నాలుగు రూకలకు ఇంకా ఇంకా తక్కువ సరుకులు రావడం. బెత్తెడు వేతనాల మధ్యతరగతి జీవులకు మరిన్ని కష్టాలు, మరిన్ని మానసిక (సామాజిక) వేదనలు, మరిన్ని అప్పులు, మరిన్ని…. కూలి జనం పరిస్ధితి ఇంకా ఘోరం. తాగుబోతు భర్తలు, తాగుబోతు తండ్రులను కలిగి ఉన్నవారి పరిస్ధితి చెప్పనే అవసరం లేదు. రూపాయి విలువను కాపాడడానికి…

రూపాయి విలువ: కిం కర్తవ్యం? -కార్టూన్

గురువారం కొద్దిగా మెరుగుపడిన రూపాయి విలువ శుక్రవారం ఇంకొంత మెరుగుపడిందని మార్కెట్ వార్తలు సూచిస్తున్నాయి. అమెరికన్ రిజర్వ్ బ్యాంకు బెన్ బెర్నాంక్ ప్రకటనతో డాలర్ కొనుగోళ్ళు, రూపాయి అమ్మకాలు పెరగడం వలన చరిత్రలోనే అత్యంత కనిష్ట స్ధాయికి పడిపోయిన రూపాయి శుక్రవారం మధ్యాహ్నానికి డాలర్ కు రు. 59.82 పై ల స్ధాయికి పెరిగిందని తెలుస్తోంది. ఈ పెరుగుదలకు కూడా మళ్ళీ ఫెడరల్ రిజర్వ్ ప్రకటనే దోహదం చేయడం గమనార్హం. ఇండియా కరెంటు ఖాతా లోటు కాస్త…

ఏదైతే అదవుతుంది! -కార్టూన్

రూపాయి విలువ నూతన లోతులకు దిగజారుతున్నా, దుగుమతుల విలువ అమాంతం పెరిగిపోతున్నా మన పాలకులకు పెద్ద ఆందోళన లేదు. సరిగ్గా చెప్పాలంటే వారిపై వారికే నమ్మకం లేదు. జనం అయితే పోలీసుల్ని, సైన్యాన్నీ దించి అణచివేయొచ్చు గానీ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ అధిపతిని వీరేమి చేయగలరు? అందువల్ల ఆందోళన పడుతున్న భారత మదుపుదారులకు ‘మరేం ఫర్వాలేదు’ అని చెబుతూ తమకు తాము ‘చేసేదేముంది ఏదైతే అడవుతుంది’ అని చెప్పుకుని నిశ్చేష్టులై ఉండిపోయారు. సుపరిపాలన (గుడ్ గవర్నెన్స్) అనేది…