పోల్: రూపాయి పతనానికి కారణం?

పాఠకులకు విజ్ఞప్తి! రూపాయి పతనం గురించి ఈ బ్లాగ్ లో వివిధ టపాలు పోస్ట్ చేశాను. అందులో ఇచ్చిన సమాచారం ఆధారంగా రూపాయి వ్యవహారం గురించి పూర్తి అవగాహనకు రాకపోవచ్చు గానీ ఒక ఐడియా అయితే దాదాపు వచ్చే ఉంటుంది. ఆ ఐడియాను ఈ పోలింగ్ లో వ్యక్తం చేయవచ్చు. ఇచ్చిన ఆప్షన్స్ కాకుండా సొంత ఐడియా ఏమన్నా ఉన్నట్లయితే అది కూడా ఇవ్వొచ్చు. —

అమెరికా మబ్బులు, ఇండియనోడి ఉబ్బులు

ఆంధ్ర ప్రదేశ్ లో, బహుశా కోస్తా ప్రాంతంలో, ఒక ముతక సామెత ఉంది. ఒక నిమ్న కులం యొక్క ఆర్ధిక వెనుకబాటుతనాన్ని, సామాజిక అణచివేతను పట్టిచ్చే సామెత అది. మరో విధంగా ఆ కులాన్ని న్యూనతపరిచే సామెత కూడాను. గురువారం ఎగిరెగిరి పడిన భారత స్టాక్ మార్కెట్లను గమనిస్తే ఈ సామెత గుర్తుకు రాక మానదు. అమెరికా ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షిస్తూ ఆ దేశ సెంట్రల్ బ్యాంకు ‘ఫెడరల్ రిజర్వ్’ ఛైర్మన్ అయిన బెన్ బెర్నాంక్,…

సిరియాపై క్షిపణి దాడి వార్తలు; రూపాయి, షేర్లు పతనం

సిరియాపై అమెరికా క్షిపణి దాడి చేసిందన్న వార్తలు గుప్పుమన్నాయి. అమెరికా, సిరియాపై రెండు క్షిపణులతో దాడి చేసిందనీ, ఈ దాడి ఫలితంగా సిరియా రాజధాని డమాస్కస్ లో 50 మంది వరకూ చనిపోయారనీ వార్తలు షికారు చేస్తున్నాయి. తెలుగు టి.వి ఛానెళ్లు ఈ వార్తను ఎక్కడినుండి సంపాదించాయో గానీ ఈ రోజు మధ్యాహ్నం నుండి స్క్రోలింగ్ లో చూపాయి. అయితే ఇందులో నిజం లేదని

ఇరాన్ చమురుతో రు.55 వేల కోట్లు ఆదా -మంత్రి

అమెరికా ఒత్తిడితో ఇరాన్ చమురు దిగుమతులను భారీగా తగ్గించుకున్న ఇండియా తద్వారా చమురు బిల్లును భారీగా పెంచుకుంది. ఆ భారాన్ని ప్రజలపై మోపి నష్టాలంటూ జనం ముక్కు పిండి వసూలు చేసింది. ఈ నిజాన్ని చమురు మంత్రి మొయిలీ ద్వారా బైటికి వచ్చింది. రూపాయి విలువ పతనం వల్ల విదేశీ మారక ద్రవ్య (డాలర్) నిల్వలు భారీగా తరిగిపోతున్న నేపధ్యంలో

ఆహార బిల్లును తప్పు పట్టొద్దు -ది హిందు సంపాదకీయం

(రూపాయి పతనానికి కారణంగా ఆహార భద్రతా బిల్లును కొంతమంది మార్కెట్ పరిశీలకులు చెప్పడాన్ని తప్పు పడుతూ ది హిందూ పత్రిక గురువారం, ఆగస్టు 29, 2013 తేదీన ప్రచురించిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. పత్రిక వెలువరించిన అత్యద్భుతమైన సంపాదకీయాల్లో ఇది ఒకటి అనడంలో నాకు ఎట్టి సందేహం లేదు. రూపాయి పతనంకు సంబంధించి మరికొన్ని అంశాలు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. -విశేఖర్) గత కొన్ని నెలల్లో ఇండియా, ఇండోనేషియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, టర్కీ దేశాల…

రూపాయి ఇంకా కిందికి…, సామాన్యుడి చావుకి!

బుధవారం రూపాయి మళ్ళీ కొత్త రికార్డుకు పతనం అయింది. మంగళవారం డాలర్ ఒక్కింటికి 66 రూపాయల మార్కు దాటి రికార్డు సృష్టించిన రూపాయి విలువ బుధవారం 68 రూపాయల మార్కు దాటిపోయింది. ఒక దశలో డాలర్ ఒక్కింటికి రు. 68.75 పై కు పడిపోయింది. కడపటి వార్తల ప్రకారం (మధ్యాహ్నం 1:45) 1 డాలర్ = రు. 68.025 వద్ద రూపాయి విలువ కొట్టుకులాడుతోంది. (బ్లూమ్ బర్గ్ వార్తా సంస్ధ) మంగళవారం ట్రేడింగ్ ముగిసేనాటికి 66.24 వద్ద…

రూపాయి విలాపం, చిదంబరం చిద్విలాసం

ఒక పక్క రూపాయి, పతనంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంటే, మరొక పక్క ఆర్ధిక మంత్రి చిదంబరం చిద్విలాసం కూడా కొనసాగుతోంది. దేశీయంగా ఆర్.బి.ఐ, ప్రభుత్వం తీసుకోవలసిన అన్ని చర్యలూ తీసుకుంటున్నామనీ, కానీ విదేశాల్లో పరిస్ధితుల వలన రూపాయి పతనం అవుతోందని నిన్నటి వరకూ మంత్రి చెబుతూ వచ్చారు. మంగళవారం సరికొత్త స్ధాయికి రూపాయి పతనం అయిన తర్వాత ఆయన కూడా సరికొత్త పల్లవి అందుకున్నారు. విదేశాల పరిస్ధితులే కాకుండా దేశంలోని పరిస్ధితులు కూడా పతనానికి కారణం అని…

రూపాయి-పార్లమెంటు: పతనం దేనిది? -కార్టూన్

నాయకుడు: అది పార్లమెంటే! సామాన్యుడు: కాదది రూపాయే! ఒక పక్క రూపాయి విలువ పతనం అవుతుండగా ఆర్ధిక వ్యవస్ధ తీరుతెన్నులను చర్చించి సవరించవలసిన చట్ట సభల సభ్యులు మాత్రం సంకుచిత రాజకీయ ప్రయోజనాలే పరమార్ధంగా రకరకాల సర్కస్ ఫీట్లు సాగిస్తున్నారు. ‘ఆహార భద్రతా బిల్లు,’ ‘ఇన్సూరెన్స్ ఎఫ్.డి.ఐ బిల్లు,’ తదితర ప్రజా వ్యతిరేక బిల్లులకు ఆమోదం పొందడానికి పాలక పక్షం చిత్రవిచిత్రమైన ఎత్తుగడలు వేస్తుండగా, పాలక పక్షం పరువు తీసి వీలైనన్ని ఓట్ల మార్కులు తమ ఖాతాలో…

పతనం: రూపాయి vis-à-vis ఉపగ్రహం -కార్టూన్

– ఈ లోపు, మరో శాటిలైట్ లంచ్ వెహికల్: – ఒక వార్త: సోమవారం ఏకంగా 148 పైసలు పతనమై డాలర్ తో మారకపు విలువ 63 రూపాయల మార్కు దాటిన రూపాయి విలువ మంగళవారం మరో కొత్త పతన స్ధాయిని నమోదు చేసింది. నిన్న 63.13 రు.ల వద్ద ముగిసిన రూపాయి విలువ ఈ రోజు ట్రేడింగ్ ఎత్తుకోవడంతోనే 63.75 రు.ల వద్ద ఎత్తుకుంది. ట్రేడింగ్ కొనసాగే కొద్దీ అదింకా పతనమై డాలర్ ఒక్కింటికి రు.…

దశాబ్దంలోనే అత్యధికంగా పడిపోయిన రూపాయి

రూపాయి పతనం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు ప్రకటించినా తన దొర్లుడుకు అడ్డే లేదు పొమ్మంటోంది. ‘కొండలు, గుట్టలు, నదీనదాలు, ఎడారులా నా కడ్డంకి?’ అని శ్రీ శ్రీ ని అరువు తెచ్చుకుని మరీ ప్రశ్నిస్తోంది. అధో పాతాళాన్ని దాటలేనా అని సవాలు చేస్తూ దొర్లి పడుతోంది. తమిళ తంబిలు (అదేనండీ చిదంబరం) ఎందరొచ్చినా, హార్వర్డ్ ఉత్పత్తులు (హార్వర్డ్ ప్రోడక్ట్ అని మన మన్మోహనుడికి పశ్చిమ పత్రికలు ఇచ్చి మురిసిపోయే సర్టిఫికేట్ ఇది) ప్రధానులే…

రూపాయి: చేతకాకపోతే సరి! -కార్టూన్

“ఏం భయపడొద్దు. అది మరింత జారిపోకుండా ఎక్కడో ఒకచోట ఆగి తీరాల్సిందే!” – “రూపాయిన పతనం కానివ్వం.”అడిగినప్పుడల్లా ప్రధాని, ఆర్ధిక మంత్రులు చెప్పే మాట ఇది. ఒక పక్క పతనం అవుతూనే ఉంటుంది. వీళ్ళేమో మీడియా సెంటర్లో కూర్చుని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతుంటారు. అదేమని అడిగితే “ఇక్కడ అంతా బాగానే ఉంది. విదేశాల్లో పరిస్ధితుల్ని మనం నియంత్రించలేము కదా?” అని చిలక పలుకులు పలుకుతున్నారు. అసలు విదేశాల్లో పరిస్ధితి బాగోలేకపోతే ఆ ప్రభావం మనమీద ఎందుకు…

జారితే ఎక్కడ ఆగుతానో నాకే తెలియదు -రూపాయి

రూపాయి పరిస్ధితి కడు దయనీయంగా మారింది. రిజర్వ్ బ్యాంకు జోక్యం చేసుకున్నా వినకుండా పాతాళంలోకి వడి వడిగా జారిపోతోంది. బుధవారం, చరిత్రలోనే ఎన్నడూ లేనంత అధమ స్ధాయికి దిగజారి డాలర్ కి రు. 60.72 పైసల దగ్గర ఆగింది. సమీప భవిష్యత్తులో ఈ జారుడు ఆగే సూచనలు కనిపించడం లేదనీ మరింతగా రూపాయి విలువ పతనం కావచ్చని విశ్లేషకులు, మార్కెట్ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. రూపాయి పతనానికి కారణం గత ఆర్టికల్ లో చర్చించినట్లు ఎఫ్.ఐ.ఐ (ఫారెన్…

స్వేచ్ఛా పతనంలో ‘రూపాయి’ -కార్టూన్

రూపాయి జారుడుకి అంతులేకుండా పోతోంది. అమెరికన్ డాలర్ కి రు. 57.01/02 పై (రాయిటర్స్) వద్దకు రూపాయి విలువ చేరింది. 2011 మధ్య నుండి ప్రారంభం అయిన పతనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పతనాన్ని అడ్డుకోవడానికి మధ్య మధ్యలో ఆర్ధిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంకు లు పలు చర్యలు చేపట్టినా అవేవీ పని చేయలేదు. 2012 లోనే దాదాపు 7 శాతం వరకూ రూపాయి పతనం అయిందని బిజినెస్ పత్రికలు లెక్క కట్టాయి. ఆసియాలో భారత…

రికార్డు స్ధాయికి రూపాయి విలువ పతనం -కార్టూన్

గత కొద్ది నెలలుగా పతన దిశలో ఉన్న రూపాయి విలువ బుధవారం మరో రికార్డు స్ధాయికి పతనం అయింది. ఉదయం డాలరుకి రు. 55.52 పై లతో ప్రారంభమై సాయంత్రం 3 గంటల సమయానికి 74 పైసలు పతనమై రు. 56.13 పై లకు పతనం అయిందని ‘ది హిందూ’ తెలిపింది. మరో పక్క యూరో, యెన్ లతో పోలిస్తే రూపాయి విలువ పెరిగింది. అయితే స్వంత కారణాలవల్ల యూరో, యెన్ లు పతనం అవడమే దీనికి…

రూపాయి పతనం ఆపడానికి ఇండియా, జపాన్ ల మధ్య ‘డాలర్ల మార్పిడి’ ఒప్పందం

అదుపు లేకుండా కొనసాగుతున్న రూపాయి విలువ పతనం అరికట్టడానికి భారత్, జపాన్ లు త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఇరు దేశాల కరెన్సీలు పతనం కాకుండా ఉండడానికి ఈ ఒప్పందం చేసుకోవడానికి ఇరు పక్షాలు గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ఫలప్రదమై వచ్చే బుధవారం ఇరు దేశాలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయవచ్చునని రాయిటర్స్, హిందూస్ధాన్ టైమ్స్ పత్రికలు తెలిపాయి. షేర్ మార్కెట్లలో ఊహాత్మక వ్యాపారం తీవ్రమైనపుడు దేశం నుండి పెట్టుబడులు తరలిపోయి కరెన్సీ…